జంతువుల నుంచి కూడా కరోనా వైరస్ సోకుతుందా? జంతుజాతులపై డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం…
ఏడాది కిందట ఆవిర్భవించిన సూక్ష్మాతి సూక్షమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తుందని, ఇన్నేసి ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు..
ఏడాది కిందట ఆవిర్భవించిన సూక్ష్మాతి సూక్షమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తుందని, ఇన్నేసి ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు.. ఏడాది కాలంలోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.. మరింత బీభత్సాన్ని సృష్టించే పనిలో ఉంది.. ఇప్పుడీ మహమ్మారి భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యరంగంలోకి దూకింది.. కరోనాను నియంత్రించే పనిలో పడింది.. మానవాళి ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను ఇప్పటి వరకు నియంత్రించలేకపోతున్నాం.. కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాం.. ఇలాంటి సమయంలో జంతువుల ద్వారా వ్యాపించకుండా ఉండేందుకు ఏం చేయాలన్నదానిపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ ఆధ్యయనం చేస్తోంది.. కొన్ని జంతువుల నుంచి కరోనా అంటుకుంటుందనే విషయం తెలిసిన తర్వాతే ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది డబ్ల్యుహెచ్ ఓ.. ప్రపంచవ్యాప్తంగా అయిదువందల రకాల జంతుజాతులపై పరిశోధన చేయాలని సంకల్పించింది. ఈ పరిశోధనలలో 194 సభ్య దేశాలు భాగస్వాములు కావాలని కోరింది. కరోనా వైరస్ ప్రమాదకారికి మారిన వెంటనే దీనికి గబ్బిలాలే కారణమని చెప్పారు కొందరు పరిశోధకులు..ఒక్క గబ్బిలాలలోనే కాదు, పిల్లులు, పులులు, సింహాలు, కుక్కలు, అలుగులలో కరోనా మాదిరి వైరస్‌లను పరిశోధకులు. చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాలలో పిల్లులు, కుక్కలకు కరోనా సోకినట్టు కనుగొన్నారు.. అమెరికాలోని ఓ జూలో పులులు, సింహాలకు కూడా కరోనా సోకినట్టు తేలింది.. యూరప్ దేశాలైన హాలెండ్, డెన్మార్క్, స్పెయిన్ దేశాలలో ముంగీస జాతి జంతువులలో కరోనా ఉన్నట్టు తెలుసుకున్నారు. అందుకే మనుషులు పెంచుకున్న జంతువులపైనే కాకుండా, మనుషులకు దగ్గరగా ఉండే జంతువులతో కూడా పరిశోధన చేయాలని నిర్ణయించింది.