సీబీఐకి అనుమతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం, సుప్రీంకోర్టు రూలింగ్

రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ తన దర్యాప్తు పరిధిని విస్తరించజాలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అను మతి తప్పనిసరి అని పేర్కొంది.

సీబీఐకి అనుమతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం, సుప్రీంకోర్టు రూలింగ్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Nov 19, 2020 | 11:26 AM

రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా సీబీఐ తన దర్యాప్తు పరిధిని విస్తరించజాలదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అను మతి తప్పనిసరి అని పేర్కొంది. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టం ఉందని న్యాయమూర్తులు వివరించారు. రాజస్తాన్, బెంగాల్, కేరళ సహా 8 రాష్ట్ర ప్రభుత్వాలు  తమ రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తునకు అనుమతిని రద్దు చేశాయి. కేంద్రం ఈ దర్యాప్తు సంస్థ పరిధిని విస్తరించజాలదని కోర్టు పేర్కొంది. యూపీలో జరిగిన అవినీతి కేసులో నిందితులైన అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని న్యాయమూర్తులు ఎ.ఎం.  ఖాన్వి ల్కర్, గవాయ్ లతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టాన్ని ప్రస్తావించింది.