Coronavirus.. శుభవార్త.. దేశంలోని 19 రాష్ట్రాల్లో ఎలాంటి కరోనామరణాలు లేవు: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ

Coronavirus..  గుడ్ న్యూస్.. 19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో మళ్లీ విజృంభిస్తోంది. పూర్తి స్థాయిలో కట్టడికి వస్తుందనుకుంటున్న తరు..

Coronavirus.. శుభవార్త.. దేశంలోని 19 రాష్ట్రాల్లో ఎలాంటి కరోనామరణాలు లేవు: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
Follow us

|

Updated on: Mar 03, 2021 | 1:51 AM

Coronavirus..  గుడ్ న్యూస్.. 19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో మళ్లీ విజృంభిస్తోంది. పూర్తి స్థాయిలో కట్టడికి వస్తుందనుకుంటున్న తరుణంలో మళ్లీ బుసలు కొడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య మెల్లమెల్లగా పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇన్నాళ్లకు ఓ శుభవార్త వచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సంభవించలేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలని ఐదు రాష్ట్రాల్లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా 91 కరోనా మరణాలు సంభవించగా, మహారాష్ట్రలో 30, పంజాబ్‌ 18, కేరళ 13 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10798921కి చేరుకోవడంతో రివరీ రేటు 97.07గా ఉంది. ఇక పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది.

ఇక సోమవారం నుంచి ప్రారంభమైన రెండో దశ కరోనా టీకా కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ విడతలో 60 ఏళ్లు పైబడిన వారి, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నా వారికి టీకా పొందే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. మంగళవారం ఉదయానికి 1.5 కోట్ల మంది టీకా వేసుకున్నారు. సోమవారం ఒక్కరోజులోనే 29 లక్షల మంది టీకా కోసం కొవిన్ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,48,54,136 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే నిన్న కరోనా కేసులు కొంచెం తక్కువగానే నమోదయ్యాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 12,286 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527 (1.11కోట్లు) కు చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 91 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,248 కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదలచేసింది.

కాగా.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా కేసులతోపాటు డిశ్చార్జ్‌ల సంఖ్య కూడా సమానంగా పెరిగింది. నిన్న కరోనా నుంచి 12,464 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 1,07,98,921 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,68,358 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.07 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,59,283 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 1వ తేదీ వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,48,54,136 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే నిన్న కరోనా కేసులు కొంచెం తక్కువగానే నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527 (1.11కోట్లు) కు చేరింది. దీంతోపాటు దేశంలో మరణించిన వారి సంఖ్య 1,57,248 కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.07 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,59,283 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 1వ తేదీ వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.

ఇవి చదవండి :

ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫాం టికెట్‌ ధర రూ.50.. కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం అంటున్న రైల్వే అధికారులు

ఏపీలో మళ్లీ గుబులు పుట్టిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 106 మందికి కోవిడ్ పాజిటివ్..!

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు