AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Third Wave: థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుంది? తాజా సర్వేలో సంచలన విషయాలు

Third wave News: దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు? వస్తే ఇది సెకండ్ వేవ్ కంటే శక్తివంతంగా ఉంటుందా? చిన్న పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతారా? ఇప్పుడు ఈ అంశాలపైనే మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

Covid Third Wave: థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుంది? తాజా సర్వేలో సంచలన విషయాలు
Corona Third Wave
Janardhan Veluru
|

Updated on: Jun 19, 2021 | 8:59 AM

Share

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు? వస్తే ఇది సెకండ్ వేవ్ కంటే శక్తివంతంగా ఉంటుందా? చిన్న పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతారా? ఇప్పుడు ఈ అంశాలపైనే మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరించడంతో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఐసీయూ  బెడ్స్‌ సంఖ్యను పెంచుకోవడం, సిబ్బంది నియామకం, మందులు సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించాయి. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.  నేపథ్యంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి లోకల్‌ సర్కిల్స్ సోషల్ మీడియా వేదికపై నిర్వహించిన సర్వే నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఊహించిన దానికంటే ముందే దేశంలో థర్డ్ వేవ్ రావొచ్చని ఆ సర్వే తేల్చింది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆంక్షలు పూర్తిగా ఎత్తేసిన వెంటనే మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. రెండు మాసాలుగా లాక్‌డౌన్‌లో తమ ఇళ్లకే పరిమితమైన జనం.. మరో నెల, రెండు నెలల్లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది థర్డ్ వేవ్‌కు దారితీసే అవకాశముందని లోకల్ సర్కిల్స్ అంచనావేసింది.

మరో రెండు మాసాల్లో రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు వెళ్తామని సర్వేలో పాల్గొన్న వారిలో 31శాతం మంది తెలిపారు. 53 శాతం మంది ఇప్పట్లో రెస్టారెంట్లకు వెళ్లే యోచన తమకు లేదని వెల్లడించారు. అలాగే షాపింగ్ కోసం మాల్స్‌కు వెళ్తామని 29 శాతం మంది తమ మనోగతాన్ని చెప్పారు. 90 శాతం మంది తమ బంధుమిత్రుల ఇళ్లను సందర్శించడం లేదా వాళ్లను తమ ఇంటికి పిలవబోతున్నట్లు తెలిపారు. అలాగే జులై మాసం నుంచి తమ ఇళ్లలో పనివాళ్లను మళ్లీ పెట్టుకోవాలని యోచిస్తున్నారు. తద్వారా ఒకట్రెండు మాసాల్లోనే జన సమూహాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తమ సర్వేలో తేలినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఈ కారణాలతో ఊహించిన దానికంటే ముందే దేశంలో థర్డ్ వేవ్‌ వచ్చే అవకాశముందని హెచ్చరించింది.

దేశంలోని 314 జిల్లాలకు చెందిన 34 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.

దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతున్నా..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని, జనం గుమికూడే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు. అలాగే మాస్క్‌లు, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి.

Also Read..Kim Jong Un: కష్టాల్లో నార్త్ కొరియా.. కిమ్ ఇలాకాలో అరడజన్ అరటిపండ్లు రూ. 3 వేలు!

Antonio Guterres: ఐక్యరాజ్య సమితి చీఫ్‌గా ఆంటోనియా గుటెరస్‌.. వరుసగా రెండోసారి ఎన్నిక