కరోనా కొత్త కేసులు.. 35 ఏళ్లలోపే వారే ఎక్కువట

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కూడా ప్రారంభం అయ్యింది. కరోనాకు తోడు చలికాలం కూడా తోడు అవుతుండటంతో

కరోనా కొత్త కేసులు.. 35 ఏళ్లలోపే వారే ఎక్కువట
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 07, 2020 | 11:38 AM

Corona Cases India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కూడా ప్రారంభం అయ్యింది. కరోనాకు తోడు చలికాలం కూడా తోడు అవుతుండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 60 శాతం 35 ఏళ్ల లోపు ఉన్న వారే ఉండటం ఇప్పుడు ఆందోళనను కలిగిస్తోంది. ( బన్నీ ‘పుష్ప’.. బాలీవుడ్‌ నటుడితో సుకుమార్ చర్చలు..!)

దాదాపుగా అన్ని రంగాలకు సడలింపులు రావడంతో ఉద్యోగాల పేరుతో ఆఫీసుకు వెళ్లాల్సి రావడం.. కాయగూరలు, నిత్యావసరాల కోసం మార్కెట్లకు వెళుతుండటం.. జనసమూహంలో గడుపుతుండటంతో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించక పోవడంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. వీరు బయట నుంచి వైరస్‌ని మోసుకొచ్చి.. ఇంట్లో ఉన్న వారికి వ్యాపిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్య ఆరోగ్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో.. పాజిటివ్ వచ్చిన వారు బయట తిరుగుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. ఇప్పటికీ కరోనాపై నిర్లక్ష్యం తగదని, జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ( 14ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న సూర్య, జ్యోతిక)