పెరుగుతోన్న కరోనా కేసులతో వణికిపోతున్న ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ గజగజమని వణికిపోతున్నది. చలితో కాదు.. పెరుగుతోన్న కరోనా తీవ్రతతో! గత 24 గంటలలో ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్న అంశం.

పెరుగుతోన్న కరోనా కేసులతో వణికిపోతున్న ఢిల్లీ
Follow us
Balu

|

Updated on: Nov 07, 2020 | 11:47 AM

దేశ రాజధాని ఢిల్లీ గజగజమని వణికిపోతున్నది. చలితో కాదు.. పెరుగుతోన్న కరోనా తీవ్రతతో! గత 24 గంటలలో ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్న అంశం. ఇప్పటి వరకు ఢిల్లీలో ఏడు వేలు కేసులు నమోదుకావడం ఎప్పుడూ జరగలేదు.. నిన్న కరోనా కాటుకు 64 మంది చనిపోయారు. కొత్త కేసులను కలుపుకుని ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4, 23,831కి చేరింది.. అసలే చలికాలం, ఆపై విపరీతమైన వాయు కాలుష్యం .. ఈ రెండూ కరోనా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చారు కానీ ఇక ముందు ప్రమాదమేనంటున్నారు వైద్య నిపుణులు.. చలికాలంలో వాయుకాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే ఇందుకు కారణమంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా మరింత చేటు తెచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసులపై ఢిల్లీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేసింది.