శ్రీ రామ మందిర నిర్మాణానికి శ్రీకారం..

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి.. సోమవారం శ్రీకారం చుట్టారు ట్రస్ట్ సభ్యులు. దేవతామూర్తుల విగ్రహాలను తాత్కాలిక కట్టడంలోకి తరలించేందుకు ప్రత్యేక పూజలు సోమవారం నాడే మొదలయ్యాయి. రామ మందిర నిర్మాణం పూర్తయ్యేవరకు విగ్రహాలను తాత్కాలిక కట్టడంలోనే ఉంచనున్నారు. మంగళవారం ఊడా పూజలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి విగ్రహాలను తరలించనున్నారు. జైపూర్‌కు చెందిన శిల్పులు తయారుచేసిన 9.5 కిలోల వెండి సింహాసనంపై.. ఈ విగ్రహాలను నెలకొల్పుతారు. కాగా.. మరోవైపు బుధవారం నుంచి జరగాల్సిన రామ్ […]

శ్రీ రామ మందిర నిర్మాణానికి శ్రీకారం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 24, 2020 | 2:07 PM

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి.. సోమవారం శ్రీకారం చుట్టారు ట్రస్ట్ సభ్యులు. దేవతామూర్తుల విగ్రహాలను తాత్కాలిక కట్టడంలోకి తరలించేందుకు ప్రత్యేక పూజలు సోమవారం నాడే మొదలయ్యాయి. రామ మందిర నిర్మాణం పూర్తయ్యేవరకు విగ్రహాలను తాత్కాలిక కట్టడంలోనే ఉంచనున్నారు. మంగళవారం ఊడా పూజలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి విగ్రహాలను తరలించనున్నారు. జైపూర్‌కు చెందిన శిల్పులు తయారుచేసిన 9.5 కిలోల వెండి సింహాసనంపై.. ఈ విగ్రహాలను నెలకొల్పుతారు.

కాగా.. మరోవైపు బుధవారం నుంచి జరగాల్సిన రామ్ నవమి మేళాను.. కరోనా నేపథ్యంలో విరమించుకున్న విషయం తెలిసిందే. అయెధ్యలో కరోనా వైరస్ నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా.. అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకొంటోంది.