Rahul Gandhi: రైతుల సత్యాగ్రహంతో కేంద్రం దిగివచ్చింది.. వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
Rahul Gandhi: మూడు కీలక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతుల సత్యాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో కేంద్రం తన ఈగోను పక్కనబెట్టి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పాల్గొన్నారు. అలాగే ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంటుందంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో జత చేర్చారు.
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया। अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
ఉదయం 9 గం.లకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆ మేరకు ఈ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతోనే దీన్ని తీసుకొచ్చినట్లు స్పష్టంచేసిన ప్రధాని మోడీ.. అయితే రైతుల ఆందోళనల నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించడంలో విఫలం చెందినట్లు చెప్పారు. కొత్త చట్టాల కారణంగా రైతులకు కలిగిన ఇబ్బందులకు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read..
PM Modi: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని ప్రకటన