AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న ముసలం.. బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో పొత్తును తప్పబట్టిన కాంగ్రెస్ నేత అనంద్‌శర్మ

జాతీయ కాంగ్రెస్ పార్టీ మరోసారి గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నేతలే గళం విప్పుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న ముసలం.. బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో పొత్తును తప్పబట్టిన కాంగ్రెస్ నేత అనంద్‌శర్మ
Balaraju Goud
|

Updated on: Mar 01, 2021 | 8:08 PM

Share

Anand Sharma slams Bengal alliance : జాతీయ కాంగ్రెస్ పార్టీ మరోసారి గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నేతలే గళం విప్పుతున్నారు. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ నిరుడు గళమెత్తిన 23 మంది (జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు జమ్మూలో బలప్రదర్శన చేశారు. పార్టీ పరిస్థితిపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడుతోంది. ఇది నిజం. దీన్ని అంతా అంగీకరించాలంటూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. తాజాగా ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అనంద్ శర్మ ట్వీట్ చేశారు. Anand Sharma slams

ఐఎస్ఎఫ్, ఇతర శక్తులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన భావజాలానికి అడ్డుకుంటుున్నాయని అనంద్ శర్మ మండిపడ్డారు. గాంధేయ, నెహ్రూవియన్ లౌకికవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ఆరోపించారు. ఈ సమస్యలను సీడబ్ల్యుసీ అధిగమించాలన్నారు. ‘కాంగ్రెస్‌ గత వైభవాన్ని చూశాం. పదేళ్లుగా పార్టీ బలహీనమవుతూ వచ్చింది. ఇంకా బలహీనం కావడాన్ని మేం చూడలేం. ఇక కొత్తతరం పార్టీకి అనుసంధానం కావాల్సిన అవసరంముందని ఆనంద్‌ శర్మ అన్నారు.

తమపై విమర్శలు గుప్పిస్తున్న వారికి దీటుగా బదులిస్తూ.. మతవాదులతో పోరాడటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్న ఆయన.. పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుబట్టారు. పిర్జాదా అబ్బాస్ సిద్దిఖీ నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో పొత్తు పెట్టుకోవాలన్న పార్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ బహిరంగంగానే తప్పుబట్టారు. వరుస ట్వీట్లలో, ఆనంద్ శర్మ కాంగ్రెస్ బెంగాల్ యూనిట్ నుండి సమాధానాలు కోరుతూ, కూటమి నిర్ణయాన్ని ‘బాధాకరమైన, సిగ్గుచేటు’ అంటూ అభివర్ణించారు.

మరోవైపు, ఉత్తర- దక్షిణ భారతావని మధ్య అంతరాన్ని వివరిస్తూ రాహుల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు కొందరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌.. దేశంలోని ఏ ప్రాంతమైనా కావొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రాంతాల వారిని సమానంగా గౌరవిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని… పార్టీ హైకమాండ్​పై తాజా తిరుగుబాటుగా పరిగణించొచ్చా? హస్తం పార్టీ రెండుగా మారడానికి జమ్ము కశ్మీర్ వేదిక అవుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసుకున్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారనేందుకు ఇదో సూచన అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండిః  అప్పుడే మొదలైన పంజాబ్ పాలిటిక్స్.. సీఎం అమరీందర్ సింగ్ రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిశోర్