శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న హర్యానా సీఎం.. ఐజీఎంసీకి తరలింపు

హ‌ర్యానా సీఎం మనోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ శ్వాస కోశ స‌మ‌స్య‌తో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా

  • Tv9 Telugu
  • Publish Date - 1:31 pm, Sat, 14 November 20
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న హర్యానా సీఎం.. ఐజీఎంసీకి తరలింపు

Manohar Lal Khattar: హ‌ర్యానా సీఎం మనోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ శ్వాస కోశ స‌మ‌స్య‌తో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో హుటాహుటిన ఆయనను ఇందిరా గాంధీ మెడిక‌ల్ కాలేజీ (ఐజీఎంసీ) ద‌వాఖానకు త‌ర‌లించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. కాగా ఖట్టర్‌కి ఆగష్టులో కరోనా సోకగా.. చికిత్స అనంతరం ఆయన కోలుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. కాగా 2014లో మొదటిసారిగా సీఎంగా గెలిచిన మనోహర్ లాల్‌ ఖట్టర్‌.. 2019 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు.

Read More:

ఎన్టీఆర్‌ సరసన కీర్తి సురేష్‌.. క్రేజీ పెయిర్‌ని సెట్‌ చేస్తోన్న మాటల మాంత్రికుడు..!

కరోనాతో మృతి చెందిన భారతీయ సంతతి డాక్టర్‌.. నివాళులు అర్పించనున్న లండన్ ఆసుపత్రి