ఇటలీ భాషలోకి భారత పౌరసత్వ చట్టం
ఇటీవల సవరించిన భారత పౌరసత్వ చట్టాన్ని ఇటాలియన్ భాషలోకి అనువదిస్తామన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. జోధ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సీఏఏ అనుకూల ర్యాలీనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. తన ప్రసంగంలో కాంగ్రెస్, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీలపై నిప్పులు చెరిగారు అమిత్ షా. పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ పార్టీతోపాటు కొన్ని పార్టీలు రాజకీయ చేస్తున్నాయని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభుత్వంపై రెచ్చగొడుతున్నాయని అమిత్ షా […]
ఇటీవల సవరించిన భారత పౌరసత్వ చట్టాన్ని ఇటాలియన్ భాషలోకి అనువదిస్తామన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. జోధ్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సీఏఏ అనుకూల ర్యాలీనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. తన ప్రసంగంలో కాంగ్రెస్, తృణమూల్, సమాజ్ వాదీ పార్టీలపై నిప్పులు చెరిగారు అమిత్ షా.
పౌరసత్వ చట్ట సవరణపై కాంగ్రెస్ పార్టీతోపాటు కొన్ని పార్టీలు రాజకీయ చేస్తున్నాయని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభుత్వంపై రెచ్చగొడుతున్నాయని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలకు చట్టసవరణకు సంబంధించిన అంశాలు అర్థం కాకపోతే.. పౌరసత్వ చట్టాన్ని ఇటాలియన్ భాషలోకి అనువదిస్తామని, దాన్ని చదువుకుంటేగానీ కాంగ్రెస్ నేతలకు చట్టం లోతుపాతులు అర్థం కావని వ్యంగ్యంగా అన్నారు.
ఎట్టిపరిస్థితుల్లోను సీఏఏపై కేంద్రం వెనక్కి తగ్గదని, పార్టీల రాంగ్ గైడెన్స్‌తో ఆందోళన చేస్తున్న వారు విరమించాలని, ఈ దేశంలోని వారెవరికీ నష్టం జరగదని తాను హామీ ఇస్తున్నానని అన్నారు అమిత్ షా. సీఏఏను వ్యతిరేకించే వారికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ ఆయన సవాల్ చేశారు.