లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తన అంకుల్.. పశుపతి కుమార్ పరాస్ తో రాజీకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన సోమవారం ఢిల్లీలో పశుపతిని కలుసుకునేందుకు వెళ్లగా పశుపతి కనీసం తన ఇంటి నుంచి బయటికైనా రాలేదు. తన కారులో చిరాగ్ పాశ్వాన్ సుమారు గంటన్నర సేపు వేచి చూసినా పశుపతి నుంచి ఆయనకు ఆహ్వానం అందలేదు, చిరాగ్ కజిన్ అయిన ప్రిన్స్ రాజ్ కూడా అదే ఇంటిలో ఉన్నప్పటికీ ఆయన కూడా బయటకు రాలేదని తెలిసింది. తన తల్లిని పార్టీ చీఫ్ ని చేయాలన్న యోచనతో ఢిల్లీకి వచ్చిన చిరాగ్ కి ఆశాభంగమే కలిగింది. ఈ రాజీ ప్రయత్నాలను పశుపతి తిరస్కరించడమే కాకుండా తమదే అసలైన లోక్ జనశక్తి పార్టీ అని ప్రకటించారు. లోక్ సభలో ఆయన ఎల్ జె పీ పార్లమెంటరి పార్టీ నేతగా ఏకగ్రివంగా ఎన్నికయ్యారు దీంతో ఆయనకు ఎదురే లేకపోయింది. ఇలా ఉండగా లోక్ జనశక్తి పార్టీలో చిరాగ్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 5 గురు ఎంపీలు జేడీ-యూ లో చేరుతారని మొదట వార్తలు వచ్చాయి, అయితే సోమవారం ఇది జరగలేదు.కానీ ఈ పరిణామాలన్నీ సీఎం నితీష్ కుమార్ సూచన;లపైనే సంభవించాయని అంటున్నారు.
ఎల్ జేపీ నిర్వహించిన సమావేశంలో ఈ పార్టీకి చెందిన నాయకులు కూడా పాల్గొనడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది…. ఇక చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవితవ్యం ఏమిటో కొద్దీ రోజుల్లోనే తేలాల్సి ఉంది…ఇప్పటి వరకు మౌనంగా ఉన్న చిరాగ్ తన రాజకీయపు కొత్త అడుగులు ఎటు వేస్తాడో తెలియాల్సి ఉంది..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అల్లంత దూరంలో కనిపించిన అద్భుత దృశ్యం.. ఆకాశంలో ఎగిరేపళ్లెం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో .
జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video