కశ్మీర్ పై చైనా వైఖరి మారినట్టేనా ?

వివాదాస్పద కశ్మీర్ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ అంశంలో పాకిస్తాన్ ను పూర్తిగా ఏకాకిని చేసినట్టేనని అంటున్నారు. ఇప్పుడిక ఏ దేశమూ పాక్ కు అండగా నిలిచిన దాఖలాల్లేవు. కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై రంకెలేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య ఐరాస నిబంధనావళికి కట్టుబడి ఉందని, ఐరాస తీర్మానాల ప్రకారం దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని […]

కశ్మీర్ పై చైనా వైఖరి మారినట్టేనా ?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 12, 2019 | 5:30 PM

వివాదాస్పద కశ్మీర్ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఈ అంశంలో పాకిస్తాన్ ను పూర్తిగా ఏకాకిని చేసినట్టేనని అంటున్నారు. ఇప్పుడిక ఏ దేశమూ పాక్ కు అండగా నిలిచిన దాఖలాల్లేవు. కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిపై రంకెలేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య ఐరాస నిబంధనావళికి కట్టుబడి ఉందని, ఐరాస తీర్మానాల ప్రకారం దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని ఇమ్రాన్ అంటూ వచ్చారు. పైగా భారత్ పై అణు యుధ్ధం జరుపుతామని కూడా బీరాలు పలికారు. కానీ చైనా అనుసరించిన ‘ డిప్లొమసీ డోస్ ‘ తో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఈ వివాదాన్ని భారత-పాకిస్థాన్ దేశాలు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని. ఇది ద్వైపాక్షిక సమస్య అని చైనా స్పష్టం చేసింది. ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఇటీవలే ఈ ప్రకటన చేశారు. పైగా టర్కీ కూడా చైనా అభిప్రాయంతో ఏకీభవించింది . ఐరాస సమావేశాల్లోనే ఆ దేశం తన వైఖరిని వెల్లడించింది. కాగా మూడు రోజుల క్రితమే -చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆ దేశం కాశ్మీర్ విషయంలో పునరాలోచనలో పడి… ఇండియాకు అనుకూల ధోరణి పాటించక తప్పలేదు.

Latest Articles
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్