మోదీ-జిన్ పింగ్ లైవ్ అప్ డేట్స్.. అసలు విషయం మాత్రం పక్కన పెట్టేశారు !

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ రెండో రోజయిన శనివారం మళ్ళీ భేటీ అయ్యారు. కోవళంలోని తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ హోటల్లో ఇద్దరూ ముఖాముఖి సమావేశమయ్యారు. అయితే అసలైన కశ్మీర్ సమస్య మాత్రం వీరి సమావేశంలో ప్రస్తావనకు రాలేదు. తాము నిన్నదాదాపు రెండున్నర గంటల పాటు ఓపెన్ గా, సౌహార్ద పూరితంగా చర్చలు జరిపినట్టు జీ జిన్ పింగ్ తెలిపారు. తమ మధ్య ముఖ్యంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల అంశం చర్చకు […]

మోదీ-జిన్ పింగ్ లైవ్ అప్ డేట్స్.. అసలు విషయం మాత్రం పక్కన పెట్టేశారు !
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 2:04 PM

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ రెండో రోజయిన శనివారం మళ్ళీ భేటీ అయ్యారు. కోవళంలోని తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ హోటల్లో ఇద్దరూ ముఖాముఖి సమావేశమయ్యారు. అయితే అసలైన కశ్మీర్ సమస్య మాత్రం వీరి సమావేశంలో ప్రస్తావనకు రాలేదు. తాము నిన్నదాదాపు రెండున్నర గంటల పాటు ఓపెన్ గా, సౌహార్ద పూరితంగా చర్చలు జరిపినట్టు జీ జిన్ పింగ్ తెలిపారు. తమ మధ్య ముఖ్యంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల అంశం చర్చకు వచ్చిందన్నారు. తాము గాఢ స్నేహితుల్లా, హృదయపూర్వకంగా చర్చలు జరిపామని, ఈ చర్చలు రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు అటు-. 2017 లో ఊహాన్ లో తమ మధ్య జరిగిన భేటీ తమకు స్ఫూర్తినిచ్చిందని, భారత-చైనా మధ్య ‘ కసెక్షన్ ; కు చెన్నై వారధిగా ఉపయోగపడిందని మోదీ పేర్కొన్నారు. కాగా- ఈ ఉదయం ఉభయ నేతలూ మొదట ఈ హోటల్లో చేనేత వస్త్రాలపై నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. ఈ ఎగ్జిబిషన్లో… భారతీయతను ప్రతిబింబించే కళాత్మక దేవతా విగ్రహాలను కూడా ఉంచారు. ఈ రోజు మోదీ నిన్నటిలా కాక, కుర్తా, పైజామా ధరించడం విశేషం. ఉభయ దేశాల నాయకులు సమావేశమయ్యే స్థలి వద్ద ఏర్పాటు చేసిన విష్ణు మూర్తి కాంశ్య విగ్రహం చూపరులను ఆకర్షిస్తోంది. ఇలా ఉండగా.. కోవళంలో స్థానికులు, జానపద కళాకారులు తమ నృత్యాలు, ఆట పాటలతో అలరించారు.

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్