లడాఖ్ బోర్డర్ లో ఇప్పటికీ 40 వేల చైనా దళాలు ?
లడాఖ్ సరిహద్దుల్లో చైనా ఇంకా తన 40 వేల దళాలను మోహరించి ఉంచిందని తెలుస్తోంది. డీ-ఎస్కలేషన్ కి ఆ దేశం ఇంకా సుముఖంగా ఉన్నట్టు కనబడడంలేదని సైనికవర్గాలు తెలిపాయి. భారత, చైనా దేశాల మధ్య వివిధ స్థాయుల్లో..
లడాఖ్ సరిహద్దుల్లో చైనా ఇంకా తన 40 వేల దళాలను మోహరించి ఉంచిందని తెలుస్తోంది. డీ-ఎస్కలేషన్ కి ఆ దేశం ఇంకా సుముఖంగా ఉన్నట్టు కనబడడంలేదని సైనికవర్గాలు తెలిపాయి. భారత, చైనా దేశాల మధ్య వివిధ స్థాయుల్లో చర్చలు జరిగినప్పటికీ ఆయా చర్చల్లో అంగీకరించిన ప్రతిపాదనల మేరకు చైనా సేనలు వెనక్కు వెళ్లాల్సి ఉందని, కానీ అలా జరగలేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని వారాల క్రితం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్… చైనా విదేశాంగ మంత్రితో ఫోన్ లో సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు కూడా.. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే చైనా సేనలు తమ సైనిక శకటాలు, ఇతర ఆయుధాలతో నియంత్రణ రేఖ సమీపంలోనే ఉన్నట్టు వెల్లడవుతోంది. గోగ్రా వంటి చోట్ల చైనావారి కట్టడాలు ఇంకా అలాగే ఉన్నాయని అంటున్నారు.