Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది జవాన్లు మృతి.. 21 మంది ఆచూకీ గల్లంతు..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి...

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది జవాన్లు మృతి.. 21 మంది ఆచూకీ గల్లంతు..
Maoists Encounter
Follow us

|

Updated on: Apr 04, 2021 | 9:38 AM

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది జవాన్లు మృతి చెందారు. మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఏడుగురు జవాన్ల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. కాగా, సుక్మా-బిజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గల్లంతైన జవాన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత 15 మంది మాత్రమే గల్లంతయ్యారని భావించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. దీనిని ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. ఇక గల్లంతైన జవాన్ల కోసం భద్రతా బలగాలు ఉదయాన్నే సెర్చ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఐజీ తెలిపారు. ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులు 1500 ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా-బిజాపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందింది. దాంతో 500 మంది భద్రతా సిబ్బంది అడవులను జల్లెడ పట్టారు. అలా కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తొలుత ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరో 30 మందికిపైగా జవాన్లు తీవ్రంగా గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగింది.

Also read:

మంచిర్యాల జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఎర్టిగ కారు.. కొడుకు అక్కడికక్కడే మృతి, భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు

అరటిపళ్ల అమ్మకం.. హోటళ్లలో పని, ఇంకొందరు చెరుకు రసం బళ్లు.. ఉపాధిహామీ పనులు, ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు ఆగమాగం

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!