AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అతన్ని 20 ఏళ్ల క్రితం చంపేశాను.. ఇప్పుడు కలలోకి వచ్చి హింసిస్తున్నాడు’.. పోలీసుల ఎదుట గగ్గోలు

ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడో వ్యక్తి. ఐతే ఇన్నాళ్ల తర్వాత ఓ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. తాను చంపేసిన వ్యక్తి తన కలలోకి వచ్చి రోజూ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. తనను రక్షించండంటూ గగ్గోలు...

'అతన్ని 20 ఏళ్ల క్రితం చంపేశాను.. ఇప్పుడు కలలోకి వచ్చి హింసిస్తున్నాడు'.. పోలీసుల ఎదుట గగ్గోలు
Chhattisgarh Crime
Srilakshmi C
|

Updated on: Apr 21, 2023 | 10:10 AM

Share

ఇరవై ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని చంపి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మాయం చేశాడో వ్యక్తి. ఐతే ఇన్నాళ్ల తర్వాత ఓ విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించాడు. తాను చంపేసిన వ్యక్తి తన కలలోకి వచ్చి రోజూ హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. తనను రక్షించండంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బాలోద్‌ జిల్లా కర్కాభాట్‌ గ్రామానికి చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 2003లో ఛబేశ్వర్‌ గోయల్‌ అనే వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాను హత్య చేసిన విషయాన్ని కొలియారా గతేడాది గ్రామస్థులతో చెప్పాడు. అతను తన భార్యకు స్నేహితుడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో హతమార్చినట్లు తెలిపాడు. తన చేతులతో చంపిన ఛవేశ్వర్‌ ఇప్పుడు తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని గ్రామస్థులతో చెప్పుకొచ్చాడు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కొలియారాను అరెస్టు చేశారు. ఐతే కొలియారా చెప్పిన ఆధారాల ప్రకారం మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో బుధవారం (ఏప్రిల్ 19) తవ్వకాలు చేపట్టగా.. వారికి ఎటువంటి మృతదేహం లభించలేదు. దీంతో కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని పోలీసులు అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

కానీ ఛవేశ్వర్‌ తండ్రి మాత్రం తన కొడుకు గత కొంతకాలంగా కనిపించడం లేదంటూ, ఆ ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో డ్యామ్‌ పక్కన కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం వాటిని ల్యాబ్‌కు పంపినట్లు ఏఎస్పీ హరీశ్ రాథోడ్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు