Tragic Love Story: విషాదంత ప్రేమ కథ.. ప్రియుడిని హత్య చేసి ఆపై సూసైడ్‌ చేసుకున్న టెకీ!

చెన్నైలోని మొగప్పైర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబత్తూరుకు చెందిన వంజినాథన్‌ (24) అనే యువకుడు తన ప్రియుడిని హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని అమింజికరైకి చెందిన లోకేష్ (25)గా పోలీసులు గుర్తించారు. లోకేష్‌ కాల్ సెంటర్‌లో పనిచేస్తుండగా, వంజినాథన్ తోరైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు వ్యక్తులు ఆన్‌లైన్ డేటింగ్ పోర్టల్ ద్వారా..

Tragic Love Story: విషాదంత ప్రేమ కథ.. ప్రియుడిని హత్య చేసి ఆపై సూసైడ్‌ చేసుకున్న టెకీ!
Chennai Man Kills Boyfriend
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 11, 2024 | 3:37 PM

చెన్నై, జనవరి 11: చెన్నైలోని మొగప్పైర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబత్తూరుకు చెందిన వంజినాథన్‌ (24) అనే యువకుడు తన ప్రియుడిని హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని అమింజికరైకి చెందిన లోకేష్ (25)గా పోలీసులు గుర్తించారు. లోకేష్‌ కాల్ సెంటర్‌లో పనిచేస్తుండగా, వంజినాథన్ తోరైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు వ్యక్తులు ఆన్‌లైన్ డేటింగ్ పోర్టల్ ద్వారా కలుసుకున్నారు. ఏడాది పాటు ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరి రిలేషన్‌ గురించి గత నెలలో ఇరు కుటుంబాలకు తెలిసిపోయింది. దీంతో వంజినాథన్ కుటుంబం అతనికి ఓ యువతితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.

కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో గత కొంతకాలంగా లోకేష్‌కు దూరంగా ఉండసాగాడు. ఈ విషయం లోకేష్‌కి తెలియడంతో కుటుంబ సభ్యల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ తమ రిలేషన్‌ కొనసాగించానలి ఒత్తిడి చేయసాగాడు. ఈ క్రమంలో వంజినాథన్‌ను కలవాలని లోకేష్ తరచూ ఫోన్‌లో అడుగుతుండేవాడు. ఈ విషయమై ఇద్దరూ గత రెండు వారాలుగా ఫోన్‌లో వాదులాడుకున్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయినా లోకేష్ ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. పైగా లోకేష్‌ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తల్లిదండ్రులు అమింజికరై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తన జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వంజినాథన్ తన సోదరికి వాయిస్ మెసేజ్‌ పంపించాడు.

పోలీసులు వంజినాథన్‌ మొబైల్‌ నంబర్‌ను ట్రాక్‌ చేయగా.. అతను మొగప్పైర్‌ వెస్ట్‌లోని పనీర్‌ నగర్‌లోని ఓ లాడ్జిలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా గదిలో రెండు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కిల్‌పాక్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (కెఎంసిహెచ్‌)కి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. వంజినాథన్‌ తన సోదరికి వాయిస్‌ మెసేజ్‌ పంపే ముందు లోకేశ్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వంజినాథన్‌ తన షూలేస్‌తో లోకేశ్‌ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.