Atal Setu: ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభంకానున్న దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి.. ‘అటల్‌ సేతు’ ప్రత్యేకతలివే

దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డులకెక్కిన అటల్‌ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (జనవరి 12) ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MHTL) ను ప్రారంభించానున్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి దేశానికి అందించిన సేవలను గుర్తుగా ఈ బ్రిడ్జీకి అటల్‌ సేతు అని నామకరణం చేశారు. ఈ అటల్‌ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

Atal Setu: ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభంకానున్న దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జి.. 'అటల్‌ సేతు' ప్రత్యేకతలివే
Atal Setu Bridge
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2024 | 4:08 PM

దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిగా రికార్డులకెక్కిన అటల్‌ సేతు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం (జనవరి 12) ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MHTL) ను ప్రారంభించానున్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి దేశానికి అందించిన సేవలను గుర్తుగా ఈ బ్రిడ్జీకి అటల్‌ సేతు అని నామకరణం చేశారు. ఈ అటల్‌ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల పొడువు ఉండే ఈ బ్రిడ్జిపై వాహన దారుల భద్రత కోసం సుమారు 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వంతెనపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కమాండ్‌ కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. ఈ మార్గం ద్వారా దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఇదే దూరానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. మొత్తం ఆరు లైన్లతో ఈ బ్రిడ్జీని ఏర్పాటు చేశారు. 21.8 కిలోమీటర్ల పొడువు ఉండే ఈ బ్రిడ్జిలొ సముద్రంపై 16.5 కిలోమీటర్లు, నేలపై 5.3 కిలోమీటర్లు ఏర్పాటుచేశారు. 2018లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. సుమారు రూ.18 వేల కోట్లతో అత్యాధునిక హంగులతో అటల్‌ సేతు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.

అటల్ సేతు బ్రిడ్జీ.. వీడియో ఇదిగో..

ఇవి కూడా చదవండి