Earthquake: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. గురువారం మధ్యాహ్నం వేళ ఢిల్లీతో పాటు NCR పరిధిలో పలు సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. గురువారం మధ్యాహ్నం వేళ ఢిల్లీతో పాటు NCR పరిధిలో పలు సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపంతో ఢిల్లీతోపాటు హర్యానా పంజాబ్, చండీఘడ్, జమ్మూ కశ్మీర్ తోపాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంక్వా నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. భారత్, పాకిస్థాన్‌లలో మధ్యాహ్నం 2.50 గంటలకు భూకంపం సంభవించింది.
#WATCH | Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India.
(Visuals from Poonch, J&K) pic.twitter.com/kMTT2XxYQ7
— ANI (@ANI) January 11, 2024
ప్రాణ, ఆస్తినష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు వెలువడలేదు.
Earthquake of magnitude 6.1 on Richter scale hits Afghanistan, tremors felt in North India pic.twitter.com/P3wHPxnVYg
— ANI (@ANI) January 11, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..