Cyber Crime: సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోయిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త

ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగే పరిచయాలు సైబర్ మోసాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు వీటి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Cyber Crime: సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోయిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
Jamrun And Her Husband
Follow us
Aravind B

|

Updated on: Apr 09, 2023 | 6:37 AM

ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగే పరిచయాలు సైబర్ మోసాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు వీటి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కేంద్రాపడా జిల్లాలోని మీర్జాపట్న గ్రామానికి చెందిన జమ్రున్‌ బీబీ అనే మహిళకు ఫేస్‌బుక్‌ ద్వారా రవిశర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.అయితే ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. రవిశర్మ కూడా జమ్రూన్ ను దీదీ అని పిలచేవాడు. తన స్వస్థలం ఝూర్ఖాండ్ అని..ప్రస్తుతం ఇంగ్లాడ్ లో ఉంటున్నానని ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి రూ.25 లక్షల విలువైన బంగారు కంఠహారం, ఫ్రిడ్జ్, ఐఫోన్ వంటి ఖరీదైన వస్తువులు పంపుతానని నమ్మించాడు. అయితే వాటిని పంపేందు రూ.170 లక్షలు కొరియర్ ఛార్జీలు అవుతాయని ఆమెకు చెప్పాడు.

అయితే రవిశర్మ మాటలను నమ్మిన జమ్రున్.. తన నెక్లేస్ ను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.60 వేలు పంపించింది. తర్వాత కొంచెం కొంచె విడతల వారిగా ఆమె నుంచి రవిశర్మ రూ.1.70 లక్షలు దండుకున్నాడు. డబ్బు మొత్తం వచ్చేశాక రవి పంపుతానన్న వస్తువులు ఎప్పటికీ రాకపోవడంతో జమ్రున్ కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుజరాత్ లో ఉంటున్న ఆమె భర్త రజీద్ కు ఈ విషయం అంతా తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. ఫోన్ చేసి జమ్రూన్ కు ముమ్మారు తలాక్ చెప్పాడు. సైబర్ మోసం వల్ల 18 ఏళ్ల జమ్రున్, రశీద్ ల అనుబంధం తెగిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం