AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir: జమ్మూలో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే.. కేంద్రం సంచలన ప్రకటన

జమ్ము కశ్మీర్‌లోని స్వయంప్రతిపత్తికి సంబంధిన ఆర్టికల్ 370కి రద్దుగా వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలైన విషయం అందరికి తెలిసిందే. అయితే వీటిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగుతోంది. అలాగే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అనేది ఎప్పుడు పునరుద్దరిస్తుందనే విషయయంపై కూడా గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే తమ వాదనలు వినిపిస్తున్న కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్దమని స్పష్టం చేసింది.

Jammu and Kashmir: జమ్మూలో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే.. కేంద్రం సంచలన ప్రకటన
Jammu And Kashmir
Aravind B
|

Updated on: Aug 31, 2023 | 3:24 PM

Share

జమ్ము కశ్మీర్‌లోని స్వయంప్రతిపత్తికి సంబంధిన ఆర్టికల్ 370కి రద్దుగా వ్యతిరేకంగా పిటీషన్లు దాఖలైన విషయం అందరికి తెలిసిందే. అయితే వీటిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగుతోంది. అలాగే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అనేది ఎప్పుడు పునరుద్దరిస్తుందనే విషయయంపై కూడా గురువారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే తమ వాదనలు వినిపిస్తున్న కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్దమని స్పష్టం చేసింది. జమ్మూలో ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. మొత్తంగా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని పేర్కొన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో కాల వ్యవధిని నిర్ణయించలేమని చెబుతూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా మాత్రం తాత్కాలికమేనని తెలిపారు. అయితే జమ్మూను పూర్తి రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. లద్దాఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదా మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు.

అలాగే జమ్మూలో గణనీయంగా అభివృద్ధి జరిగినట్లు సప్రీంకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. కొత్త ప్రాజెక్టులు అక్కడ భారీగా వస్తున్నాయని అన్నారు. అలాగే ఉగ్రవాద చర్యలు కూడా 42.5 శాతం తగ్గిపోయాయని తెలిపారు. మరోవైపు చొరబాటు ఘటనలు కూడా 90.20 శాతం తగ్గిపోయాయని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో ఏకంగా కోటిమంది పర్యాటకుల కశ్మీర్ లోయను సందర్శించారని తెలిపారు. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంపై కేంద్ర కీలక ప్రకటన చేయనుంది. అలాగే నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకు నివేదించనుంది కేంద్రం.2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. విపక్ష నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదాను కల్పిస్తామని అప్పట్లో కేంద్రం చెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం