AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Speaking4India: ‘రేపటి భారతదేశం కోసం ఓ దక్షిణాది గొంతుక’.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ 2024 పార్లమెంట్ ఎన్నికలపై సీఎం స్టాలిన్ గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. గురువారం తన పోడ్‌కాస్ట్ ఆడియో సిరీస్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ని ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో భారతదేశం విధ్వంసం అవుతుందని.. రేపటి భారతదేశం కోసం నడుంబిగించాలంటూ.. స్పీకింగ్ ఫర్ ఇండియా పేరుతో నూతన ప్రచారానికి రంగం సిద్ధం చేశారు.

Speaking4India: ‘రేపటి భారతదేశం కోసం ఓ దక్షిణాది గొంతుక’.. సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం..
MK Stalin
Shaik Madar Saheb
|

Updated on: Aug 31, 2023 | 4:35 PM

Share

Southern Voice Speaks For INDIA: ఎన్నికలు సమీపిస్తున్నాయి.. దీంతో ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా స్పీడు పెంచింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఇండియా కూటమి మూడోసారి భేటీ కానుంది. ముంబై వేదికగా ఇవాళ, రేపు ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇండియా కూటమి భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా, ఇండియా కూటమి లోగో ఆవిష్కరణ, సమన్వయ కమిటీ, కన్వీనర్ల నియామకం, సీట్ల పంపకాలపై కీలక చర్చలు జరుగనున్నాయి. శివసేన ఉద్ధవ్ థాక్రే ఆతిథ్యమివ్వనున్న ఈ సమావేశంలో 28 పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశం ఇండియా కూటమి భవిష్యత్తు ప్రణాళికకు కీలకం కానుంది.

అయితే, ఈ సమావేశానికి ముందు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ 2024 పార్లమెంట్ ఎన్నికలపై సీఎం స్టాలిన్ గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. గురువారం తన పోడ్‌కాస్ట్ ఆడియో సిరీస్ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ని ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో భారతదేశం విధ్వంసం అవుతుందని.. రేపటి భారతదేశం కోసం నడుంబిగించాలంటూ.. స్పీకింగ్ ఫర్ ఇండియా పేరుతో నూతన ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ఆడియో సిరీస్‌ని విడుదల చేయనున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. రేపటి భారతదేశం కోసం ఒక దక్షిణాది స్వరం మాట్లాడుతుంది.. అంటూ స్టాలిన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఇది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

స్టాలిన్ వీడియో..

‘‘తమిళ ప్రజలు సిద్ధంగా ఉండాలి.. ఇండియా కోసం మాట్లాడాల్సిన టైం ఒచ్చింది. . మనం పోరాడే సమయం వచ్చింది.. 2024 పార్లమెంట్ ఎన్నికలే మన టార్గెట్.. బీజేపీ కి గట్టి బుద్ధి చెప్పాలి.. కేంద్రంలో నూతన సర్కార్ ఏర్పాటుకి మనం పోరాడాలి.. డీఎంకే ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తవుతోంది.. పార్లమెంటులో మూడవ ప్రధాన పార్టీగా అవతరించింది. దీనిని దిగ్గజ నాయకులంతా నడిపించారు. మాజీ ముఖ్యమంత్రులు సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి దేశంలో తీవ్ర ప్రభావాన్ని సృష్టించారు” అని తమిళనాడు ముఖ్యమంత్రి గతంలో ట్విటర్‌లో ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు. పాడ్‌కాస్ట్ ఇంగ్లీష్, ఇతర భారతీయ భాషలలో అందుబాటులో ఉంటుందని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..