వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 72 పెంచిన కేంద్రం.. రైతుల ఆందోళన చల్లారేనా …?
2021-22 పంటల సంవత్సరానికి గాను కేంద్రం వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 72 రూపాయలు పెంచింది. ఇప్పటివరకు ఇది క్వింటాలు 1868 రూపాయలుండగా ఇక 1940 రూపాయలకు పెరిగింది. ఇతర ఖరీఫ్ పంటలకు కూడా కనీస మద్దతు...
2021-22 పంటల సంవత్సరానికి గాను కేంద్రం వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 72 రూపాయలు పెంచింది. ఇప్పటివరకు ఇది క్వింటాలు 1868 రూపాయలుండగా ఇక 1940 రూపాయలకు పెరిగింది. ఇతర ఖరీఫ్ పంటలకు కూడా కనీస మద్దతు ధరను పెంచినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.ఖరీఫ్ లో వరి ప్రధాన పంటగా ఉంటోంది. నైరుతిరుతుపవనాలు ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు నాటేందుకు సిద్ధమయ్యారు. జూన్-సెప్టెంబరు మధ్య కాలంలో సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ఇదివరకే అంచనా వేసింది. అటు కంది-మినపప్పులకు కూడా కనీస మద్దతు ధరను పెంచినట్టు కేంద్రం వెల్లడించింది. వీటికి ఎం ఎస్ పీని 300 రూపాయల మేర పెంచారు. ఇది 5 శాతం పెరుగుదల అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. దీనితో క్వింటాలు 6,300 రూపాయలైందనిఈ వర్గాలు పేర్కొన్నాయి. కానీ జొన్న పంటకు మాత్రం క్వింటాలు 20 రూపాయలు మాత్రమే పెరిగింది.ఇప్పుడిది క్వింటాలు 1870 రూపాయలుంది.తమ పంటలకు కనీస మద్దతు ధర పెంచాలంటూ అన్నదాతలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో వివాదాస్పదమైన మూడు చట్టాలను రద్దు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్..
రైతు సంఘాలతో చర్చలకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, కానీ ఈ చట్టాల రద్దుపై తాము వారితో మాట్లాడేది లేదని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. దీనిపై గతంలోనే వారికీ వివరించామన్నారు. ఇలా ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర పెంపు ప్రకటనపై రైతు సంఘాలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇవి తమలో తాము సమావేశమై ఈ విషయంలో తమ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోనున్నట్టు సమాచారం.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది..అన్నం తినలేదు కొట్టాను అంటూ తల్లి కేర్ లెస్ ఆన్సర్ :Viral video.