YouTube Channels Banned: 150 యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లపై నిషేధం.. మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం..
YouTube Channels: ఫేక్ క్యాంపెయిన్‌తో జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. మొత్తం 150 యూట్యూబ్ చానళ్లపై ఉక్కుపాదం మోపింది.

కేంద్రం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. 150 కంటే యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. భారత్‌కు చెందిన 18 యూట్యూబ్ ఛానెళ్లతో పాకిస్తాన్‌కు చెందిన 4 యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించారు. దేశభద్రతకు ముప్పుగా మారాయని ఈ ఛానెళ్లపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యతిరేంగా వార్తలను ఈ ఛానెళ్లలో ప్రసారం చేస్తునట్టు ఆరోపణలు వచ్చాయి. మన దేశంపై దుష్ప్రచారం చేస్తున్న 150 యూట్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. నిఘా వర్గాల సహకారంతో, సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ నిషేధం నిర్ణయం తీసుకుంది.
150 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లు, YouTube ఆధారిత వార్తా ఛానెల్లు ఇందులో ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో భారత వ్యతిరేక కంటెంట్ ప్రోత్సహిస్తున్నట్లుగా మంత్రిత్వ శాఖ గుర్తించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్ 69A ఉల్లంఘన కారణంగా ఈ వెబ్‌సైట్‌లు, ఛానెల్‌లు తొలగించబడ్డాయి. గత రెండేళ్లలో 150 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెల్‌లు ‘యాంటీ-ఇండియా’ కంటెంట్‌ను రూపొందించినందుకు తొలగించబడ్డాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
YouTube ఛానెల్‌లు 12.1 మిలియన్ కంటే ఎక్కువ మందిసబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మొత్తం 1324.26 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను కలిగి ఉన్నాయి. రెచ్చగొట్టే కంటెంట్ పోస్టు చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై మైనారిటీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ ఛానళ్లు. తొలగించబడిన ఛానెల్‌లలో ఖబర్ విత్ ఫ్యాక్ట్స్, ఖబర్ తైజ్, ఇన్ఫర్మేషన్ హబ్, ఫ్లాష్ నౌ, మేరా పాకిస్థాన్, హకిఖత్‌కి దునియా, అప్నీ దునియా పేర్లు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం