Farmers Good News: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్.. డీఏపీ ఎరువుపై సబ్సిడీ 140% పెంపు.. బస్తా ధర రూ. 1,200
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో నజరానా ప్రకటించింది. అన్నదాతలకు ఉపశమనం కలిగించే విధంగా డీఏపీ ఎరువులపై ఇచ్చే సబ్సిడీని 140% పెంచింది . ఇక నుంచి DAP బ్యాగ్ ధర రూ.1,200.
Modi Take Historic Pro-Farmer Decision: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో నజరానా ప్రకటించింది. అన్నదాతలకు ఉపశమనం కలిగించే విధంగా డీఏపీ ఎరువులపై ఇచ్చే సబ్సిడీని 140% పెంచింది . రైతులకు 2,400 రూపాయలకు బదులుగా బ్యాగ్‌కు 1,200 రూపాయల చొప్పున డి-అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువులు అందించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎరువుల ధరలపై సబ్సిడీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయంగా ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన ధరలు పెరగడంతో ఎరువుల ధర పెరుగుతోందన్న ఊహగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ రైతులకు పాత రేటుకే ఎరువులు విక్రయించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రైతులకు అందిస్తున్న సబ్సిడీని 140 శాతం పెంచాలని సూచించారు. దీంతో ఇక నుంచి బస్తా డీఏపీ ఎరువు ధర రూ.1200 లకే లభించనుంది. పెరిగిన ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
सरकार किसानों के जीवन को बेहतर बनाने के लिए प्रतिबद्ध है। इसलिए अंतरराष्ट्रीय मूल्यों में बढ़ोतरी के बावजूद हमने उन्हें पुरानी दरों पर ही खाद मुहैया कराने का निर्णय लिया है। आज के फैसले के बाद DAP खाद का एक बैग 2400 रु की जगह 1200 रु में ही मिलेगा।https://t.co/cjJcqUsgEG
— Narendra Modi (@narendramodi) May 19, 2021
ఇటీవల డీఏపీ ఎరువులో ఉపయోగించే ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన ధరలు అంతర్జాతీయంగా 60 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగిపోయాయి. దీంతో బస్తా డీఏపీ ధర రూ.2,400 కు చేరుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్బిడీ ప్రకారం రూ.500 తగ్గించి రైతులకు రూ.1,900 కు విక్రయిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతులకు బస్తా డీఏపీ రూ.1,200 లకే అందుబాటులోకి రానుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ.14,775 అదనపు భారం పడనుందని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎరువులపై సబ్బిడీని కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందేనని ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఇక, దేశ వ్యాప్తంగా రసాయన ఎరువులకు సంబంధించి కేంద్రం ప్రతి సంవత్సరం రూ.80,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నెల ప్రారంభంలోనే పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతలకు ప్రత్యక్ష ప్రయోజనం కింద నగదు బదిలీ కార్యక్రమం చేపట్టారు. ప్రధాని స్వయంగా రైతుల ఖాతాల్లో రూ.20,667 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశారు.