Gold Mines: దేశ వ్యాప్తంగా 13 బంగారు గనుల విక్రయానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌లోనే..

Gold Mines: దేశంలో మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దేశ స్థూల జాతీయ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు బంగారు గనులను విక్రయించేందుకు అడుగులు వేస్తోంది...

Gold Mines: దేశ వ్యాప్తంగా 13 బంగారు గనుల విక్రయానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌లోనే..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 15, 2022 | 12:06 PM

Gold Mines: దేశంలో మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు దేశ స్థూల జాతీయ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు బంగారు గనులను విక్రయించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 గోల్డ్‌ మైన్స్‌ను రానున్న రోజుల్లో విక్రయించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోని బంగారు గనులను అమ్మనున్నారు. ఈ 13 గనుల్లో 10 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి కావడం విశేషం.

ఏపీలో విక్రయించనున్న గోల్డ్‌ మైన్స్‌లో రామగిరి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి నార్త్‌ బ్లాక్‌, బొకసంపల్లి సౌత్‌ బ్లాక్‌, జవకుల-ఎ, జవకుల-బి, జవకుల-సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్‌ బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు. ఇందుకుగాను గత మార్చి నెలలోనే టెండర్లకు ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్‌లోని బంగారు గనులకు కూడా ఇదే నెలలో వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మూడు గనుల్లో రెండు సోనపహారి బ్లాక్‌, ధుర్వ బియాదండ్‌ బ్లాక్‌ కాగా మరో బ్లాక్‌ సోన్‌భద్రలో ఉంది.

ఇదిలా ఉంటే దేశంలో ఖనిజాల వేలం నిబంధనల్లో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, దీని ద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని గునుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. గనుల మంత్రిత్వ శాఖ 2015లో రెండుసార్లు, 2021లో రెండుసార్లు సవరణ చేసింది. రాష్ట్రాలు, పరిశ్రలు, మైనింగ్ చేసే వారితో పాటు సాధారణ ప్రజలతో విస్తృత సంప్రదింపు తర్వాత ఈ సవరణలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నెలలో ఈ ఐదు రోజులు ఉల్లి, వెల్లుల్లి తినొద్దు.. ఎందుకంటే..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
నార్త్‌లో సౌత్ సినిమాల జోరు.. బోల్తా కొడుతోన్న బాలీవుడ్..
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
చైనాకు గట్టిపోటీస్తున్న భారత్.. ఆ రంగం వృద్ధిలో టాప్
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
మెగా వేలంలో ఆ ఐదుగురు యువ ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టడం ఖాయం
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ యంగ్ ప్లేయర్ జట్టులోకి?
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
భారత ప్రాచీన శాస్త్ర విజ్ఞానం.. ఎన్నో అద్భుత ఆవిష్కరణలు..
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
నారీ భారత్‌.. భారీగా ఉద్యోగాలు..ఆకాశనందే ప్యాకేజీలు
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..
ఇది పుష్పగాడి సత్తా.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..