AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..

కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. బాధిత చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ..

Kadapa: సచ్చినోడు.. రిటైర్మెంట్‌‌కు దగ్గరపడ్డాడు.. పాపం ఆ పాప ఇంటికి వెళ్లి ఏడుస్తూ..
Teacher Misconduct
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Feb 02, 2026 | 7:45 PM

Share

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామ వాంఛతో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోరుమామిళ్ల మండలంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌లో జరిగిన ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆ చిన్నారి, ఇంటికి వెళ్లిన తర్వాత బోరున ఏడుస్తూ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు స్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న సుబ్బారెడ్డి మరింత దురుసుగా ప్రవర్తిస్తూ చిన్నారి తల్లిపై దాడికి ప్రయత్నించడంతో అక్కడున్న గ్రామస్తులు అతడిని చితకబాదారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థుల పట్ల ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు, అది కూడా రిటైర్మెంట్ దశకు చేరువలో ఉన్న వ్యక్తి, చిన్న బాలికపై ఇలాంటి అసభ్య ప్రవర్తనకు పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యాశాఖ అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..