AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: తక్షణ ఊరట నుంచి భవిష్యత్‌ వృద్ధికి పాలసీ బ్రిడ్జ్

బడ్జెట్‌–2026లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వం–వృద్ధి మధ్య సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. FY27 నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే, మౌలిక సదుపాయాలపై రూ.12.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, ఎంఎస్‌ఎంఈలు, హై–వాల్యూ వ్యవసాయ పంటలపై కొనసాగింపు విధానాలతో పాటు, బయోఫార్మా శక్తి, రేర్‌ ఎర్త్‌ కారిడార్లు, ఎస్ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ వంటి కొత్త పథకాలతో భవిష్యత్‌ వృద్ధికి పునాది వేసింది.

Budget 2026: తక్షణ ఊరట నుంచి భవిష్యత్‌ వృద్ధికి పాలసీ బ్రిడ్జ్
Budget 2026
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2026 | 5:08 PM

Share

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన యూనియన్‌ బడ్జెట్‌–2026ను ప్రభుత్వం ఒక పాలసీ బ్రిడ్జ్‌గా అభివర్ణిస్తోంది. కోవిడ్‌ అనంతర ఆర్థిక పునరుద్ధరణను కొనసాగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థను భవిష్యత్‌ అవసరాలకు సిద్ధం చేయడమే ఈ బడ్జెట్‌ లక్ష్యం. అతిశయ నిర్ణయాలకు దూరంగా, స్థిరత్వం..వృద్ధి మధ్య సమతుల్యతను పాటించిన ఈ బడ్జెట్‌లో సుమారు 60–70 శాతం కొనసాగింపు విధానాలే కనిపిస్తాయి. అదే సమయంలో తయారీ, సాంకేతికత, గ్లోబల్‌ సరఫరా గొలుసుల్లో భారత్‌ పాత్రను బలపరిచే కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌–2026లో ప్రధానంగా గత కొన్నేళ్లుగా అమలులో ఉన్న విధానాలనే మరింత బలోపేతం చేశారు. ఆర్థిక లోటును FY27 నాటికి జీడీపీలో 4.3 శాతంకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. FY31 నాటికి అప్పు–జీడీపీ నిష్పత్తిని 50 శాతంకు తగ్గించడమే దీర్ఘకాల లక్ష్యం. పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, నియమాలను సులభతరం చేసేలా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌–2025ను ప్రవేశపెట్టనుంది.

మౌలిక సదుపాయాలపై దృష్టి:

దేశ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మౌలిక సదుపాయాల పెట్టుబడులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ ఏడాది క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ను రూ.12.2 లక్షల కోట్లు (జీడీపీలో 3.1 శాతం)కి పెంచింది. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు, 20 కొత్త జలమార్గాలు, 7 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల అభివృద్ధికి ఇది తోడ్పడనుంది.

తయారీ–టెక్నాలజీ విస్తరణ:

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ స్థానం బలపడేలా ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0ను ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌ కాంపొనెంట్స్‌ తయారీ పథకానికి కేటాయింపులు రూ.40 వేల కోట్లకు పెరిగాయి.

ఎంఎస్‌ఎంఈలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ:

200 పాత పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ, టైర్‌–2, టైర్‌–3 పట్టణాల్లో అనుసరణ సహాయానికి ‘కార్పొరేట్‌ మిత్రాలు’ ప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగావకాశాలకు ఊతమిచ్చారు. వ్యవసాయంలో హై–వాల్యూ పంటలు, నేషనల్‌ ఫైబర్‌ స్కీమ్‌పై దృష్టి పెట్టారు.

వ్యూహాత్మక ఖనిజ భద్రత:

ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్‌ ఎర్త్‌ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది ఎలక్ట్రానిక్స్‌, ఈవీ, రక్షణ రంగాలకు కీలకంగా మారనుంది.

శాస్త్ర–ఆరోగ్య రంగంలో ముందడుగు:

రూ.10 వేల కోట్లతో ‘బయోఫార్మా శక్తి’ పథకంను ప్రకటించారు. బయోఫార్మా పరిశోధన, క్లినికల్‌ ట్రయల్స్‌లో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం.

ఆర్థిక వ్యవస్థ సంస్కరణలు:

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రిస్క్‌ గ్యారంటీ ఫండ్‌ ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎంఈల విస్తరణ కోసం ఎస్ఎంఈ గ్రోత్‌ ఫండ్‌, ట్రీడ్స్‌ ద్వారా ఇన్వాయిస్‌లకు సెకండరీ మార్కెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

తక్షణ ఊరట చర్యలు:

భవిష్యత్‌ లక్ష్యాలతో పాటు, సామాన్యులకు వెంటనే ఊరట కలిగించే నిర్ణయాలు కూడా ఉన్నాయి. విదేశీ విద్య, వైద్యం, టూర్‌ ప్యాకేజీలపై TCSను 5% నుంచి 2%కు తగ్గింపు చేశారు.  17 కీలక ఔషధాలపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత దిగుమతులపై టారిఫ్‌ 20% నుంచి 10%కు తగ్గించారు.  చిన్న తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకు ముగింపు పలికి.. ఐటీఆర్‌ గడువుల పొడిగింపు చేశారు.

మహిళా సంక్షేమం:

జెండర్‌ బడ్జెట్‌ను 11 శాతం పెంచి రూ.5 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. మహిళా వ్యాపారాలను స్వయం ఉపాధి నుంచి యాజమాన్య స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం.

త్వరిత పరిష్కారాలు కాదు.. దీర్ఘకాల దృష్టి

బడ్జెట్‌–2026లో ఆకర్షణీయమైన ‘షార్ట్‌కట్స్‌’ లేవు. బదులుగా, విధాన స్థిరత్వం, దీర్ఘకాల పెట్టుబడులు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టింది. నేటి వ్యాపారాలపై భారాన్ని తగ్గిస్తూ, రేపటి వృద్ధికి బలమైన పునాదులు వేయడమే ఈ బడ్జెట్‌ సారాంశం.

విభాగం          చర్య / పథకం        ప్రధాన వివరాలు    విధాన స్వభావం
ఆర్థిక విధానం ఆర్థిక లోటు లక్ష్యం FY27లో జీడీపీలో 4.3%; FY31 నాటికి అప్పు–జీడీపీ 50% కొనసాగింపు
మౌలిక సదుపాయాలు మూలధన వ్యయం రూ.12.2 లక్షల కోట్లు (జీడీపీలో 3.1%); రైల్వేలు, జలమార్గాలు, లాజిస్టిక్స్ కొనసాగింపు
పన్నుల వ్యవస్థ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌–2025 ఏప్రిల్‌ 2026 నుంచి సరళమైన పన్ను చట్టం; రేట్లలో మార్పుల్లేవు కొనసాగింపు
తయారీ రంగం ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు సెమీకండక్టర్‌ మిషన్‌ విస్తరణ; కాంపొనెంట్స్‌ పథకానికి రూ.40 వేల కోట్లు కొనసాగింపు
ఎంఎస్‌ఎంఈలు & ఉద్యోగాలు క్లస్టర్లు, స్కిల్లింగ్ 200 పారిశ్రామిక క్లస్టర్ల పునరుద్ధరణ; టూరిజం గైడ్లు, AVGC ల్యాబ్స్‌ కొనసాగింపు
వ్యవసాయం హై–వాల్యూ పంటలు, ఫైబర్ ఎగుమతి దృష్టి; నేషనల్‌ ఫైబర్‌ స్కీమ్‌ కొనసాగింపు
ఆరోగ్యం & టెక్ బయోఫార్మా శక్తి రూ.10 వేల కోట్లు (5 ఏళ్లు); 1,000 క్లినికల్‌ ట్రయల్‌ కేంద్రాలు కొత్తది
కీలక ఖనిజాలు రేర్‌ ఎర్త్‌ కారిడార్లు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు కొత్తది
ఎంఎస్‌ఎంఈ ఫైనాన్స్‌ ఎస్ఎంఈ గ్రోత్‌ ఫండ్‌ ఎంఎస్‌ఎంఈల విస్తరణకు రూ.10 వేల కోట్లు కొత్తది
మౌలిక సదుపాయాల ఫైనాన్స్‌ రిస్క్‌ గ్యారంటీ ఫండ్‌ మౌలిక ప్రాజెక్టులకు భాగస్వామ్య క్రెడిట్‌ గ్యారంటీ కొత్తది
వాణిజ్యం & కస్టమ్స్‌ ఇంటిగ్రేటెడ్‌ కస్టమ్స్‌ సిస్టమ్‌ రెండేళ్లలో ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ కొత్తది
ఎగుమతులు కొరియర్‌ ఎగుమతి పరిమితి 10 లక్షల విలువ పరిమితి తొలగింపు కొత్తది

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..