AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుటికీ మర్చిపోరన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
Anil kumar poka
|

Updated on: Sep 17, 2020 | 5:19 PM

Share

సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుటికీ మర్చిపోరన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ విమోచన ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆరెస్ పార్టీలు ఎంఐఎం పార్టీకి బానిసగిరి చేస్తూ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆయన విమర్శించారు. నిరంకుశ నిజం పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన గొప్ప దినం ఇవాళ అని ఆయన కీర్తించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని తన నివాసంలో జెండా ఆవిష్కరించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎంపీ జి.వివేక్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి. ఆంధ్ర పాలకులు నిర్వహించట్లేదని ఉద్యమసమయంలో విమర్శించిన కేసీఆర్, ఇప్పుడెందుకు ఆ పని చేయట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Follow Us
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు
నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!
వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!