Cervical cancer: సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా కేంద్రం అడుగులు.. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు.

మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వికల్ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలల్లో ఎక్కువ శాతం మరణాలకు కారణం అవుతున్న..

Cervical cancer: సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా కేంద్రం అడుగులు.. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు.
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 24, 2022 | 3:36 PM

మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వికల్ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలల్లో ఎక్కువ శాతం మరణాలకు కారణం అవుతున్న క్యాన్సర్స్‌లో సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌) ఒకటి. దీన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అందించనుంది. దేశంలోని ప్రతి జిల్లాలో 5 నుంచి 10వ తరగతి వరకు బాలికల సంఖ్యను క్రోడీకరించడం ప్రారంభించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరింది.

కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను పాఠశాలల ద్వారా పంపిణీ చేయనుంది. ఒకవేల పాఠశాలకు రాలేని బాలికలకు ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. కమ్యూనిటీ ఔట్‌రీచ్, మొబైల్ టీమ్‌ల ద్వారా టీకాలు అందించున్నారు. వ్యాక్సిన్‌ ప్రక్రియ కోసం కేంద్రం U-WIN అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిలా ఉంటే గర్భాశయ క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించాలని, దేశవ్యాప్తంగా విద్యార్థినుల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రచారం కల్పించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కోరింది.

పాఠశాలల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నోడల్‌ వ్యక్తిని గుర్తించేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గర్భాశయయ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. భారత్‌లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించి, సరైన చికిత్స అందించగలిగితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..