AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా.. ఆ దేశ పర్యటనలో అత్యల్ప ఖర్చు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై తరచూ వివాదాలు నెలకొంటాయి. విదేశీ పర్యటనల పేరుతో ప్రధాని మోదీ ప్రజల సొమ్ము దుర్వినయోగం చేస్తున్నారనే విమర్శలు గతంలో వినిపించాయి. అయితే ప్రధానమంత్రి హోదాలో వివిధ దేశాల్లో పర్యటించడం, ద్వైపాక్షిక సంబంధాల..

PM Modi: ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా.. ఆ దేశ పర్యటనలో అత్యల్ప ఖర్చు..
Narendra Modi Tour
Amarnadh Daneti
|

Updated on: Dec 09, 2022 | 5:22 AM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై తరచూ వివాదాలు నెలకొంటాయి. విదేశీ పర్యటనల పేరుతో ప్రధాని మోదీ ప్రజల సొమ్ము దుర్వినయోగం చేస్తున్నారనే విమర్శలు గతంలో వినిపించాయి. అయితే ప్రధానమంత్రి హోదాలో వివిధ దేశాల్లో పర్యటించడం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వివిధ అంతర్జాతీయ సదస్సులు మొదలైన వాటికోసం వివిధ దేశాల ప్రధానమంత్రులు ఇతర దేశాల్లో పర్యటిస్తూ ఉంటారు. అధికారిక పర్యటనకు ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి ఖర్చు చేస్తుంది. గత ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ విదేశాల్లో చేసే అధికారిక పర్యటనల కోసం గత ఐదేళ్లలో రూ.239కోట్లు ఖర్చయినట్లు కేంద్రప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని పార్లమెంట్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను మరింత విస్తరించడమే ప్రధానమంత్రి విదేశీ పర్యటనల లక్ష్యమని పేర్కొన్నారు.

దేశ ప్రయోజనాలతోపాటు విదేశాంగ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఇటువంటి పర్యటనలు ఎంతో ముఖ్యమన్నారు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్. . అంతర్జాతీయ నేరాలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీతోపాటు ఇతర అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ అజెండాను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు ఉంటాయని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ వెల్లడించారు.

ఐదేళ్లలో మొత్తం 36 విదేశీ పర్యటనలు చేయగా వీటిలో 31 పర్యటనలకు బడ్జెట్‌ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 2017లో ప్రధాని మోదీ తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, ఇటలీ పర్యటనలు చేశారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు రూ.239,04,08,625 కోట్లు ఖర్చు అయ్యిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా పర్యటన కోసం రూ.23కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 26-28 తేదీల మధ్య జపాన్‌ పర్యటనకు అత్యల్పంగా రూ.23లక్షలు ఖర్చయినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us