AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Deaths: కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!

Covid Deaths: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది...

Covid Deaths: కరోనా మృతులకు రూ.50 వేల పరిహారం.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!
Subhash Goud
|

Updated on: Sep 28, 2021 | 10:02 PM

Share

Covid Deaths: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. వైరస్‌ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF) కింద వీటిని అందజేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇదే సమయంలో దీనిపై స్పందించిన ఒడిశా ప్రభుత్వం.. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం.. ధృవీకరించిన కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దేశంలో కరోనా వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకూ మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కోవిడ్‌-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పరిహారం మొత్తాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) కింద అందజేసే చర్యలు చేపట్టాలని రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ న్యాయవాది గౌరవ్‌ కుమార్‌ బన్సాల్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ (NDMA) సిఫార్సు చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిపై తుది తీర్పును అక్టోబర్‌ 4వ తేదీన వరకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

ఇవీ కూడా చదవండి:

AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?

R.1 COVID Variant: మానవాళిపై పగబట్టిన కోవిడ్.. కొత్తవేరియంట్ గుర్తింపు.. 35 దేశాల్లో 10వేల మంది బాధితులు

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు