AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బిగ్‌ షాక్.. అవి ఇవ్వలేమని తేల్చిసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తమకు కరోనా సమయంలో నిలిపివేసిన కరువు భత్యం (డీఏ) విషయంలో స్పష్టతనిస్తూ.. 18 నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల..

Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 15, 2022 | 7:46 AM

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తమకు కరోనా సమయంలో నిలిపివేసిన కరువు భత్యం (డీఏ) విషయంలో స్పష్టతనిస్తూ.. 18 నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి కారణంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ను కేంద్రప్రభుత్వం నిలిపివేసింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు కరువు భత్యం (డీఏ) ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంది. ఆర్థిక పరిస్థితి కుదుటపడిన తర్వాత ఈ బకాయిలను చెల్లిస్తారని ఉద్యో్గులు భావించారు. అయితే డీఏ బకాయిలపై కాంగ్రెస్ సభ్యుడు నరేన్ భాయ్ జే రావత్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరీ సమాధానం ఇచ్చారు. కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల కరువు భత్యం బకాయిలు చెల్లించాలనే ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చాయని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని, ఈ కారణంగా 18 నెలల డీఏ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదన్నారు. వాస్తవానికి 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏలు పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుదల ఉంటుంది. కరోనా సమయంలో డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెరగలేదు. మూడు సార్లు స్థిరంగానే కొనసాగింది. దీంతో గత మూడు డీఏలు (18 నెలల బకాయిలు) చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటు వేదికగా స్పష్టతనిచ్చింది. దీంతో తమకు బకాయి డీఏలు వస్తాయని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు పెద్ద షాక్ తగిలినట్లైంది.

కేంద్రప్రభుత్వం 2021 జులైలో డియర్‌నెస్ అలవెన్స్‌ని తిరిగి ప్రారంభించింది. 1 జూలై 2021 నుండి కరువు భత్యాన్ని 11 శాతం పెంచింది. దీని తరువాత, జూలై 2021 నుండి డియర్‌నెస్ అలవెన్స్ 17 శాతం నుండి 28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. 18 నెలల బకాయిల అంశంపై కేంద్రప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

డీఏలు ఉద్యోగుల హక్కు అని, వాటిని చెల్లించకుండా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు చెబుతున్నారు. కరోనా కాలంలో ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేశారని, ఆ సమయంలో డీఏ పెంచనప్పటికీ తమ పనిని కొనసాగించారన్నారు. ఎంతో మంది కోవిద్ సమయంలో మరణించారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన చేయడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..