UCC: ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం అడుగులు.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు..
ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఈ మేరకు.. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఈ మేరకు.. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భేటీకి న్యాయమంత్రిత్వ శాఖతోపాటు లా కమిషన్ అధికారులు హాజరయ్యారు. ఇక.. దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉంది. అందుకే.. ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని చూస్తోంది మోదీ సర్కార్. అయితే.. ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని కొన్ని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




