సుశాంత్ కేసులో ‘సైకలాజికల్ అటాప్సీ’ పై సీబీఐ దర్యాప్తు
సుశాంత్ కేసులో సీబీఐ వినూత్న ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తోంది. అతని మృతికి దారి తీసిన పరిస్థితులనే కాకుండా..సూసైడ్ కి ముందు అతని ప్రవర్త న ఎలా ఉండేదన్నదానిపైనా అధికారులు ఆరా తీయనున్నారు.
సుశాంత్ కేసులో సీబీఐ వినూత్న ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తోంది. అతని మృతికి దారి తీసిన పరిస్థితులనే కాకుండా..సూసైడ్ కి ముందు అతని ప్రవర్త న ఎలా ఉండేదన్నదానిపైనా అధికారులు ఆరా తీయనున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇందుకు సంబంధించి ప్రతి అంశాన్నీ అధ్యయనం చేస్తుందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సుశాంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల నుంచి వాట్సాప్ చాట్స్, త న కుటుంబంతోనూ, స్నేహితులు, ఇతరులతోను జరిపిన సంభాషణల వరకు ప్రతి అంశాన్నీ విశ్లేషించనున్నారు.
ఆత్మహత్యకు ముందు అతని బిహేవియర్ ఎలా ఉండేది, హిందుజా ఆసుపత్రిలో అతడుఏయే డాక్టర్లను కాంటాక్ట్ చేశాడు.. అతని మైండ్ సెట్ ‘పోస్ట్ మార్టం’ కూడా ఈ అధ్యయనంలో భాగమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సునంద పుష్కర్ డెత్ కేసులోనూ, ఢిల్లీలో రెండేళ్ల క్రితం 11 మంది బురారీ నివాస వ్యక్తుల సామూహిక సూసైడ్ల కేసులో కూడా సీబీఐ ఈ విధమైన దర్యాప్తు నిర్వహించింది.