హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడు మైనర్, సీబీఐ

హత్రాస్ కేసు నలుగురు నిందితుల్లో ఒకడు మైనర్ అని సీబీఐ వెల్లడించింది. అతని  స్కూలు మార్క్ షీట్ ప్రకారం ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు.

  • Umakanth Rao
  • Publish Date - 1:36 pm, Tue, 20 October 20
హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడు మైనర్, సీబీఐ

హత్రాస్ కేసు నలుగురు నిందితుల్లో ఒకడు మైనర్ అని సీబీఐ వెల్లడించింది. అతని  స్కూలు మార్క్ షీట్ ప్రకారం ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు జరిపిన దర్యాప్తులో చాలా లోపాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అధికారులు తమ ఇంటికి వచ్చి..తన కొడుకు మార్కుల షీట్ తీసుకువెళ్లారని, తన కొడుకు మైనర్ అని నిందిత బాలుడి తల్లి తెలిపింది. మార్కుల షీట్ లో వాడు పుట్టినతేదీ 2002, డిసెంబరు 2 అని ఉంది. అయితే ఈ తేదీ వివరాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారు అధికారులు. కాగా హత్రాస్ కేసు నిందితులు ప్రస్తుతం అలీగఢ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిని సీబీఐ 8 గంటలపాటు విచారించింది.