వదలని కోవిడ్ , రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన మాజీ సీబీఐ అధికారి రఘోత్తమన్ మృతి,

1990 ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన మాజీ సీబీఐ అధికారి కె. రఘోత్తమన్ కోవిడ్ 19 తో చెన్నైలో మరణించారు. ఆయన వయస్సు 76 ఏళ్ళు.. మొదట రాజీవ్ గాంధీ హత్య కేసుపై...

  • Updated On - 3:18 pm, Thu, 13 May 21 Edited By: Phani CH
వదలని కోవిడ్ , రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన మాజీ  సీబీఐ అధికారి రఘోత్తమన్ మృతి,
Cbi Ex Officer Who Probed Rajiv Gandhi Assasination Case Dies


1990 ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన మాజీ సీబీఐ అధికారి కె. రఘోత్తమన్ కోవిడ్ 19 తో చెన్నైలో మరణించారు. ఆయన వయస్సు 76 ఏళ్ళు.. మొదట రాజీవ్ గాంధీ హత్య కేసుపై అప్పటి ప్రభుత్వం నియమించిన సిట్ బృందానికి ఆయన నేతృత్వం వహించారు. 1968-2006 మధ్య దాదాపు 4 దశాబ్దాల కాలంలో రఘోత్తమన్ తానొక్కరే ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సుమారు దశాబ్దం పాటు సాగింది. 1998లో పోలీస్ మెడల్, 1994 లో ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఈయన ఎన్నో ఉన్నత స్థాయి కేసుల ఇన్వెస్టిగేషన్ జరిపినప్పటికీ తన రిటైర్మెంట్ తరువాత ‘కాన్స్ పిరెసీ టు కిల్ రాజీవ్ గాంధీ ‘ (రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర) పేరిట రాసిన పుస్తకం పలు వివాదాలకు కారణమైంది. అప్పటి సీబీఐ డైరెక్టర్ డీ.ఆర్.కార్తికేయన్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఎం.కె.నారాయణన్ పై ఆయన ఈపుస్తకంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో రాజీవ్ హత్యకు సంబంధించి స్థానిక వీడియోగ్రాఫర్ తీసిన వీడియో క్యాసెట్ గురించి రఘోత్తమన్ ఇందులో ప్రస్తావించారు. ఆ వీడియో టేపును నారాయణన్ తమ సిట్ సంస్థకు అప్పగించలేదని, కార్తికేయన్ సూచనపై దాన్ని భూస్థాపితం చేశారని ఆరోపించారు. కాగా ఈ కేసును రఘోత్తమన్ దర్యాప్తు చేసినప్పటికీ .. ఆ తరువాత ఆయన దోషులకు న్యాయం జరగాలని కోరుతూ గళమెత్తడం విశేషం. వారికీ మరణ శిక్షను విధించరాదని ఆయన కోరుతూ వచ్చారు.
దేశాన్ని, ప్రపంచ దేశాలను కూడా నాడు కుదిపేసిన రాజీవ్ గాంధీ హత్య కేసును ఒక్కడే స్వయంగా దర్యాప్తు చేసిన రఘోత్తమన్, కోవిడ్ కాటుకు బలి కావడం విచారకరం.

మరిన్నిచదవండి ఇక్కడ :హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఆక్సిడెంట్..గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌… గాల్లో బండి షాకింగ్ వీడియో :

చిరు ఎంట్రీతో మరింత క్రేజ్ సంపాదించుకున్న సాలార్ మూవీ ..మాఫియా డాన్ గా మెగాస్టార్..(వీడియో):Chiru in Salar movie video.

ఆ సీన్‌లో నటించింది పవన్‌ కాదు ..గబ్బర్ సింగ్ మూవీపై డైరెక్టర్ హరీష్ శంకర్ సన్షేనల్ కామెంట్స్