పీఎం కేర్స్ ఫండ్ నిధులను బదలాయించలేం, సుప్రీంకోర్టు

కరోనా వైరస్ని  అదుపు చేసేందుకు అత్యవసర సమయాల్లో వినియోగించడానికి ఉద్దేశించి ఏర్పాటైన  పీఎం కేర్స్ రెస్పాన్స్ ఫండ్ లోని నిధులను  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కు బదిలీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

  • Umakanth Rao
  • Publish Date - 12:18 pm, Tue, 18 August 20
పీఎం కేర్స్ ఫండ్ నిధులను బదలాయించలేం, సుప్రీంకోర్టు

కరోనా వైరస్ని  అదుపు చేసేందుకు అత్యవసర సమయాల్లో వినియోగించడానికి ఉద్దేశించి ఏర్పాటైన  పీఎం కేర్స్ రెస్పాన్స్ ఫండ్ లోని నిధులను  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కు బదిలీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా చారిటబుల్ ట్రస్ట్ నిధులని వివరించింది. ఈ ఫండ్ ని నేషనల్ డిజాస్టర్ ఫండ్ కి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే అలా చేయవచ్చునని సూచించింది. పీఎం కేర్స్ ఫండ్ నిధులను బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది.

ఈ ఫండ్ ని కేంద్రం గత మార్చిలో ఏర్పాటు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలున్నాయని, అందువల్ల ఈ నిధులను ప్రకృతి వైపరీత్యాల అత్యవసర సహాయ నిధికి బదలాయించాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కోరాయి. ఓ ఎంజీవో సంస్థ కూడా ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్.సుభాష్ రెడ్డి, షా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారించి దీన్ని కొట్టివేసింది.