యూపీ ఆరోగ్యశాఖ మంత్రి అతుల్ గర్గ్ కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో మంత్రికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అతుల్ గర్గ్ కరోనా బారిన పడినట్లు తెలిపారు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్య కూడా అంతకంతకు వృద్ధి చెందుతూనే ఉంది. కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రెట్టింపు అవుతోంది. ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో మంత్రికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అతుల్ గర్గ్ కరోనా బారిన పడ్డినట్లు తెలిపారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కాగా, కరోనా బారిన పడ్డవారిలో ఇద్దరు మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ ఇప్పటికే మృతి చెందారు. దీనికి ముందు యోగి ప్రభుత్వానికి చెందిన మొత్తం ఎనిమిది మంది మంత్రులకు కరోనాకు సోకింది. ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్, న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్, జల విద్యుత్‌శాఖ మంత్రి మహేంద్ర సింగ్, ఆయుష్ రాష్ట్ర మంత్రి ధరం సింగ్ సైపీ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉపేంద్ర తివారీలకు కరోనా వైరస్ బారిన పడ్డవారిలో ఉన్నారు. అయితే, తనను వారం రోజులుగా కలిసిన పార్టీ నేతలు, అధికారులు హోం ఐసోలేషన్ ఉండాలని మంత్రి అతుల్ గార్గ్ కోరారు. తన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.




