మొట్ట మొదటి వర్చ్యువల్ చిత్రంలో స్టార్ హీరో

ఇండియాలోనే మొట్ట మొదటి వర్చ్యువల్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్ట్‌కి గోకుల్రాజ్ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని హిందీ, మలయాళం, తెలుగు, తమళం, కన్నడ భాషల్లో విడుదల..

మొట్ట మొదటి వర్చ్యువల్ చిత్రంలో స్టార్ హీరో
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 12:17 PM

ఇండియాలోనే మొట్ట మొదటి వర్చ్యువల్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్ట్‌కి గోకుల్రాజ్ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని హిందీ, మలయాళం, తెలుగు, తమళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలో అయ్యప్పనమ్ కోషియం అనే సినిమాతో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు పృథ్వీ రాజ్. దివంగత సచి దర్మకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇప్పుడు వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంది.

తాజాగా ఓ వర్చ్యువల్ చిత్రంలో నటించనున్నట్లు పృథ్వీ రాజ్ తన ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాల్లో ప్రకటించాడు. అలాగే ప్రకటనతో పాటు ఓ పోస్టర్‌ని కూడా షేర్ చేశాడు. అందులో ఫిల్మ్ మేకింగ్‌లో కూడా ఇదొక గొప్ప కళ. అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఇదొక ఉత్తేజాన్నిచ్చే కొత్త అధ్యాయం. అందుకోసం అందరూ ఎదురు చూస్తూ ఉండండి. మారుతున్న కాలాలు కొత్త కొత్త సవాళ్లు వినూత్న పద్దతులను అనుసరించి ఒక గొప్ప పురాణ కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి. అంటూ ట్వీట్ చేశాడు పృథ్వీ రాజ్.

Read More:

హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్

బ్రేకింగ్: ఢిల్లీ ఎయిమ్స్‌లో అమిత్ షా అడ్మిట్

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!