Mumbai Court: అమ్మాయిని ఐటమ్ అని పిలిచాడు.. దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కోర్టు.. అలా అంటే..

|

Oct 26, 2022 | 8:38 AM

16 ఏళ్ల అమ్మాయిని.. ఐటమ్ అని పిలిచిన నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ మహారాష్ట్రలోని ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.. అమ్మాయిలను వస్తువు (ఐటెమ్) గా పేర్కొనడం..

Mumbai Court: అమ్మాయిని ఐటమ్ అని పిలిచాడు.. దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన కోర్టు.. అలా అంటే..
Mumbai Court
Follow us on

16 ఏళ్ల అమ్మాయిని.. ఐటమ్ అని పిలిచిన నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ మహారాష్ట్రలోని ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.. అమ్మాయిలను వస్తువు (ఐటెమ్) గా పేర్కొనడం.. “లైంగిక ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుందని”.. ఇది క్షమించరాని నేరమంటూ వెల్లడించింది. స్త్రీల పట్ల అణకువగా వ్యవహరించడం నేరమని.. ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్‌జె అన్సారీ తన తీర్పులో వెల్లడించారు. మహిళలను లైంగిక పద్ధతిలో పిలవడం.. వేధించడం భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 354 ప్రకారం నేరమని తెలిపారు. మహిళల రక్షణ కోసం ఇలాంటి నేరాలు, అనాలోచిత ప్రవర్తనను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని.. తన 28 పేజీలో తీర్పులో వెల్లడించారు.

కేసు వివరాలు.. ఓ అమ్మాయిని యువకుడు ఐటెమ్ అంటూ వేధించాడు.. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక పోక్సో కోర్టు.. నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ తీర్పునించింది.. ఈ ఘటన 2015 జూలైలో జరగగా.. నిందితుడైన వ్యాపారవేత్తను ఈ కేసులో దోషిగా తేల్చుతూ ఈ తీర్పునిచ్చింది. జూలై 14, 2015న పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న తనను 25 ఏళ్ల ఓ వ్యాపారవేత్త ద్విచక్ర వాహనంపై వెంబడించి.. తన జుట్టు పట్టుకుని లాగుతూ.. ‘ఐటమ్‌’ ( క్యా ఐటెం కిదర్ జా రహీ హో) ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పిలిచినట్లు బాలిక కోర్టులో వెల్లడించింది.

ఈ విషయంపై విచారించిన ప్రత్యేక పోక్సో కోర్టు.. అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే అలా పిలుస్తారంటూ పేర్కొంది. ఇలాంటి నేరాలను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని.. రోడ్‌సైడ్‌ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నిందితుల విషయంలో కనికరం చూపాల్సిన అవసరం లేదని జస్టిస్‌ ఎస్‌జే అన్సారీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం