Sarpanch: ఆదర్శ మహిళా సర్పంచ్‌.. ఊరి భద్రత కోసం ఏం చేసిందో తెలిసి సెల్యూట్‌ చేస్తున్న గ్రామస్తులు

ఆమె నిర్ణయాన్ని సర్పంచ్ భర్త వికాస్ కైత్వాస్ కూడా అంగీకరించారు.

Sarpanch: ఆదర్శ మహిళా సర్పంచ్‌.. ఊరి భద్రత కోసం ఏం చేసిందో తెలిసి సెల్యూట్‌ చేస్తున్న గ్రామస్తులు
Sarpanch
Follow us

|

Updated on: Sep 15, 2022 | 12:25 PM

Sarpanch:  ఇక్కడ ఓ గ్రామ పంచాయతీ హైటెక్‌ హంగులు అద్దుకుంది. ఆ గ్రామ సర్పంచ్‌ చేసిన పనితో ఆ గ్రామం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఊరికోసం సర్పంచ్‌ చేసిన పనికి గ్రామస్తులు ప్రశంసలతో ముంచేస్తున్నారు. బుర్హాన్‌పూర్‌లోని జిరి గ్రామ పంచాయతీకి కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్ అశాబాయి కైత్వాస్ స్ఫూర్తిదాయకమైన సర్పంచ్‌గా ఎదిగారు. మహిళా సర్పంచ్ తన గ్రామ భద్రత కోసం తన సొంత నగలను తాకట్టు పెట్టి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆమె చేసిన ఈ పనితో అందరూ ఆ మహిళా సర్పంచ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్‌ గ్రామ పంచాయతీ జిరి మహిళా సర్పంచ్‌ ఆశాబాయి కైత్వాస్‌ పంచాయతీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన నగలు తాకట్టు పెట్టి గ్రామ పంచాయతీ జిరిలో 80 వేల విలువైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

గ్రామంలో జరిగే ప్రమాదాలు, దొంగతనాలు, వేధింపులు, కిడ్నాప్‌లు వంటి ఘటనలు కెమెరాల్లో నిక్షిప్తమై నిందితులను సులువుగా పట్టుకునేందుకు వీలుగా ఆశాబాయి ఈ కెమెరాలను అమర్చారు. ఈ మేరకు మహిళా సర్పంచ్ ఆశాబాయి మాట్లాడుతూ గ్రామస్తుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమన్నారు.అంతే కాదు.. ఇది తన ఎన్నికల అంశం కూడా అని చెప్పారు..అందులో భాగంగానే హైవే, పంచాయతీలో 80 వేల HD నాణ్యత, రాత్రి వేళల్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 4 కెమెరాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు.

కొన్ని నెలల క్రితం ఇక్కడ చిన్నారిని కిడ్నాప్ చేయడం లాంటి ఘటన జరిగిందని సర్పంచ్ తెలిపారు. హైవేపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో 72 గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇండోర్ ఇచ్ఛాపూర్ హైవే కిల్లర్ హైవేగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి సర్పంచ్ పంచాయతీ బాధ్యతలు చేపట్టాక ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా లావాదేవీలు నిలిచిపోవడంతో పాటు కొత్త సర్పంచ్ డీఎస్సీ కూడా సిద్ధం కాకపోవడంతో డబ్బులు రావడంలో జాప్యం జరిగింది. అదే సమయంలో భద్రత దృష్ట్యా వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడలేక ఆభరణాలను తాకట్టు పెట్టి సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని సర్పంచ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆమె నిర్ణయాన్ని సర్పంచ్ భర్త వికాస్ కైత్వాస్ కూడా అంగీకరించారు. CCTV కెమెరాల ఏర్పాటులో అతని భార్యకు సహాయం చేసారు. ఇదే విషయంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. పంచాయతీ పరిధిలో ప్రమాదాలు, వేధింపులు, దొంగతనాలు, కిడ్నాప్‌లు వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లాకే తొలి ఆదర్శ మహిళా సర్పంచ్‌గా గుర్తింపు పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..