కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ డిగ్రీపై రాజుకున్న వివాదం.. యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చెప్పారంటే?
NDA మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ డిగ్రీకి సంబంధించి కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి. చిరాక్‌కు బి-టెక్ డిగ్రీ లేదని ఝాన్సీ బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ పేర్కొన్నారు.

NDA మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ డిగ్రీకి సంబంధించి కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి. చిరాక్‌కు బి-టెక్ డిగ్రీ లేదని ఝాన్సీ బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ పేర్కొన్నారు. చిరాగ్ ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాడని, అయితే అతను మొదటి సెమిస్టర్‌కు మాత్రమే పరీక్ష రాశాడని పేర్కొన్నాడు. మిగిలిన సెమిస్టర్స్ పూర్తి చేయలేదన్నారు.
చిరాగ్ పాశ్వాన్ డిగ్రీకి సంబంధించి ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. బుందేల్‌ఖండ్ యూనివర్శిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రిజేంద్ర శుక్లా చిరాగ్ డిగ్రీకి సంబంధించి ఈ వ్యాఖ్యలు వేశారు. చిరాగ్ పాశ్వాన్ 2005లో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో అడ్మిషన్ తీసుకున్నారని తెలిపారు. యూనివర్సిటీలో అడ్మిషన్ తర్వాత, అతను మొదటి సెమిస్టర్ పరీక్షకు మాత్రమే హాజరయ్యాడు, కానీ ఆ తర్వాత అతను పరీక్షకు హాజరు కాలేదని ప్రొఫెసర్ బ్రిజేంద్ర శుక్లా తెలిపారు. మొదటి సెమిస్టర్ తర్వాత, చిరాగ్ పాశ్వాన్ వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన 8 సెమిస్టర్ పరీక్షలకు హాజరు కాలేదన్నారు. దీని కారణంగా అతని బి.టెక్ డిగ్రీని యూనివర్సిటీ నిలిపివేయడం జరిగిందన్నారు.
ఇదిలావుంటే, ఎంపీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో చిరాగ్ పాశ్వాన్ కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ (రెండో సెమిస్టర్) ఉన్నత విద్యార్హతగా పేర్కొన్నారు. ఇది ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2005లో కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ (రెండవ సెమిస్టర్) అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్డీఏతో పొత్తుతో పోటీ చేసి విజయం సాధించారు. చిరాగ్ పాశ్వాన్ మోదీ 3.0 సర్కార్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిరాగ్ తనను తాను ప్రధాని మోదీ హనుమంతుడిగా పిలుచుకుంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా, అతను కుల గణన నుండి లేటరల్ ఎంట్రీ, UCC వరకు సమస్యలపై ప్రభుత్వం నుండి భిన్నమైన ప్రకటనలు చేశారు.
మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




