AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir: ‘జమ్మూకశ్మీర్‌లో కిడ్నాపైన ఆర్మీ జవాన్‌ మృతదేహం లభ్యం’.. ఇండియన్ ఆర్మీ వెల్లడి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఓ టెరిటోరియల్ ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాపైన టెరిటోరియల్ ఆర్మీ జవాన్ మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహంపై తుపాకీ గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిడ్నాప్‌ అనంతరం ఉగ్రవాదులు ఆర్మీ జవాన్‌ను తీవ్ర చిత్రహింసలకు గురి చేసి, తుపాకులతో కాల్చి చంపినట్లు..

Jammu and Kashmir: 'జమ్మూకశ్మీర్‌లో కిడ్నాపైన ఆర్మీ జవాన్‌ మృతదేహం లభ్యం'.. ఇండియన్ ఆర్మీ వెల్లడి
Missing Army Jawan Bullet Ridden Body Recoverd
Srilakshmi C
|

Updated on: Oct 09, 2024 | 12:39 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఓ టెరిటోరియల్ ఆర్మీ జవాన్‌ కిడ్నాప్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాపైన టెరిటోరియల్ ఆర్మీ జవాన్ మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహంపై తుపాకీ గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిడ్నాప్‌ అనంతరం ఉగ్రవాదులు ఆర్మీ జవాన్‌ను తీవ్ర చిత్రహింసలకు గురి చేసి, తుపాకులతో కాల్చి చంపినట్లు ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.

భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. అటవీ ప్రాంతంలో మిలిటెంట్ కదలికలను గుర్తించడానికి ఇద్దరు ఆర్మీ జవాన్లు నిఘా మిషన్‌కు పంపారు. అయితే, వీరిద్దరూ తీవ్రవాదుల బృందాన్ని ఎన్‌కౌంటర్ చేశారు. వీరిలో ఒకరు భుజంపై బుల్లెట్‌ గాయంతో బయటపడగా.. దురదృష్టవశాత్తు మరొక జవాన్‌ను ఉగ్రవాదులు అపహరించారు. మంగళవారం నుంచి సైనికుడు కనిపించకుండా పోవడంతో.. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ సంఖ్యలో మొహరించి, గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు ఆర్మీ జవాన్‌ను అపహరించిన కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత కిరాతకంగా హతమార్చారు. జవాన్‌ డెడ్‌ బాడీ దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్‌లోని అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది. మృతి చెందిన జవాన్‌ను అనంత్‌నాగ్‌లోని ముక్ధంపోరా నౌగామ్‌కు చెందిన హిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. అధికారులు హిలాల్ అహ్మద్ భట్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భట్ మృతదేహాన్ని వైద్య లాంఛనాల కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..

అక్టోబర్ 8న ప్రారంభించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 161 యూనిట్‌కు చెందిన ఇద్దరు సైనికులు అనంత్‌నాగ్‌లోని అటవీ ప్రాంతంలో కిడ్నాప్‌కు గురయ్యారు. కానీ, వారిలో ఒకరు బుల్లెట్‌ గాయాలతో తప్పించుకుని తిరిగి రాగలిగారు. రెండో జవాన్‌ మాత్రం ఉగ్రమూక చేతిలో చిక్కుకున్నారు. గాయపడిన సైనికుడిని చికిత్స కోసం వైద్య శిబిరానికి తరలించామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇక కనబడకుండా పోయిన జవాన్ కోసం ఆ ప్రాంతంలో ఆర్మీ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అక్టోబర్ 5న జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రమూక చొరబాటుకు యత్నించగా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు ముందు దోడా జిల్లాలో సాయుధ ఉగ్రవాదులతో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఓ పోలీసు అధికారి మరణించారు. పాకిస్తాన్ మద్దతుదారు జైష్-ఎ-మహ్మద్ (JeM) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రాక్సీ గ్రూప్‌లోని ‘కశ్మీర్ టైగర్స్’ చేసినట్లు ప్రకటించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.