Boris Johnson: కోవిడ్ ఎఫెక్ట్…భారత పర్యటన రద్దు చేసుకున్న బ్రిటన్ ప్రధాని..

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం సోమవారం అధికారిక నిర్ణయం తీసుకుంది.

Boris Johnson: కోవిడ్ ఎఫెక్ట్...భారత పర్యటన రద్దు చేసుకున్న బ్రిటన్  ప్రధాని..
Boris Johnson
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 19, 2021 | 3:59 PM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం సోమవారం అధికారిక నిర్ణయం తీసుకుంది.వాస్తవానికి ఈ ఏడాది జనవరి మాసంలో భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్…బ్రిటన్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాయిదావేసుకున్నారు. ఈ నెల చివరి వారంలో ఆయన భారత్‌లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్ ప్రభుత్వం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా బోరిస్ జాన్సన్ వచ్చే వారం భారత్‌లో పర్యటించలేకపోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే ఈ నెలాఖరులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్‌గా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి..కరోనా భయం గుప్పెట్లో ఏపీ సచివాలయం…మూడు రోజుల్లో నలుగురు మృతి

కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయండి.. హైకోర్టులో షబ్బీర్ అలీ పిటిషన్

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?