నాలుగోసారి.. సీఎం పీఠమెక్కిన చౌహాన్..

ఎన్నో మలుపులు తిరిగి.. చివరకు మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారంతో ముగిసింది. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు. […]

నాలుగోసారి.. సీఎం పీఠమెక్కిన చౌహాన్..
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2020 | 7:26 AM

ఎన్నో మలుపులు తిరిగి.. చివరకు మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారంతో ముగిసింది. బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు.

కాగా.. అంతకుముందు.. సోమవారం సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చౌహాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో.. కొత్త మంత్రి వర్గాన్ని వచ్చే వారంలో విస్తరించే అవకాశం ఉంది.

మరోవైపు కేబినెట్ విస్తరణలో.. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి పెద్ద పీఠ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన..తన వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు. సింధియా బీజేపీలో చేరిన అనంతరం.. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కమల్ నాథ్‌ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. పార్టీ బలం 92 మందికి పడిపోయింది. దీంతో సభ బలం 206కు తగ్గి.. మెజార్టీ 104కి పడిపోయింది. అయితే అప్పటికే బీజేపీకి 107 ఉండటంతో.. ఇతర పార్టీల మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..