Rahul Gandhi in Pub: నేపాల్‌ టూర్‌లో రాహుల్‌గాంధీ.. ఖాట్మండు నైట్‌ క్లబ్‌లో యువరాజు జల్సాలు..!

నేపాల్‌ టూర్‌లో ఉన్న రాహుల్‌గాంధీ..ఖాట్మండు నైట్‌ క్లబ్‌లో కనిపించారు. ఇబ్బందుల్లో ఉన్న పార్టీని వదిలి.. విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు కొందరు నేతలు.

Rahul Gandhi in Pub: నేపాల్‌ టూర్‌లో రాహుల్‌గాంధీ.. ఖాట్మండు నైట్‌ క్లబ్‌లో యువరాజు జల్సాలు..!
Rahul Gandhi
Follow us

|

Updated on: May 03, 2022 | 1:12 PM

Rahul Gandhi in Kathmandu Night Club: నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ. ఎస్‌.. నేపాల్‌ టూర్‌లో ఉన్న రాహుల్‌గాంధీ..ఖాట్మండు నైట్‌ క్లబ్‌లో కనిపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య యూరప్‌తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్‌లో మూడు దేశాల పర్యటనలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ నేపాల్ చేరుకున్నారు. అయితేదీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇబ్బందుల్లో ఉన్న పార్టీని వదిలి.. విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు కొందరు. నేపాల్‌లోని చైనా అంబాసిడర్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాహుల్‌ నేపాల్‌లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్‌ ఓ కథనం ప్రచురించింది.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం నేపాల్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై బీజేపీ దాడి చేసింది. ఈ వీడియో నేపాల్‌లోని లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్ నుండి వచ్చింది. మయన్మార్‌లో నేపాల్‌ రాయబారిగా పనిచేసిన భీమ్‌ ఉదాస్‌..తన కుమార్తె వివాహానికి రాహుల్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆ వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్‌ నేపాల్‌ వెళ్లినట్టు సమాచారం.

రాహుల్ గాంధీ చేస్తున్నది ఆయన వ్యక్తిగత విషయమని బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా అన్నారు. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో హింస జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజస్థాన్ ఓ వైపు మండుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేయడానికి బదులు రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పార్టీలు చేసుకుంటున్నారు. అయితే భారతీయులతో కలిసి వారి సమస్యలను తెలుసుకోవాల్సిందిపోయి సరదా సంబరాల్లో మునిగితేలిపోయారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది. అందుకే రాహుల్ గాంధీ ఇలాగే నడుస్తుంది. ఆయన రాజకీయాల్లో సీరియస్ కాదు. తన పార్టీకి, దేశ ప్రజలకు అవసరమైనప్పుడు నేపాల్‌లో పార్టీ చేసుకుంటున్నారంటూ పూనావాలా విమర్శించారు.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీ, వెకేషన్, పార్టీ, హాలిడే, ప్లెజర్ ట్రిప్, ప్రైవేట్ ఫారిన్ విజిట్ తదితర వీడియోలను షేర్ చేస్తూ విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో జల్సా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ చేస్తూ.. ఇది రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదు. రాహుల్ గాంధీ ఎవరితో ఉన్నారని ప్రశ్నించారు. చైనాలో ఏజెంట్లు ఉన్నారా? సైన్యానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ చైనా ఒత్తిడి వల్లేనా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ప్రశ్నలు రాహుల్ గాంధీది కాదు దేశానికి సంబంధించినదని పేర్కొన్నారు.

ముంబైపై దాడి జరిగినప్పుడు రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌లోనే ఉన్నారని బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ కష్టాల్లో కూరుకుపోవడంతో ఆయన ఇంకా నైట్‌క్లబ్‌లోనే ఉన్నారు. అంటూ ట్వీట్ చేశారు.

రాహుల్‌ గాంధీ నేపాల్‌ టూర్‌పై బీజేపీ విమర్శల నేపథ్యంలో ఘాటుగా స్పందించింది కాంగ్రెస్‌. స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా అండగా నిలిచారు. దేశంలో ఇప్పటి వరకు వివాహ వేడుకలకు హాజరుకావడం నేరం కాదని, ఈరోజు తర్వాత వివాహానికి హాజరుకావడం చట్టవిరుద్ధమా అని ప్రశ్నించారు. స్నేహం చేయడం నేరమని బీజేపీ నిర్ణయించిందేమో’ అని ట్వీట్ చేశారు. 2015లో ప్రధాని మోదీ అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె వివాహానికి అనూహ్యంగా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ సుర్జేవాలా విమర్శించారు.

ఇదిలా ఉండగా.. కొద్ది గంటల క్రితమే ప్రధానమంత్రి మూడు దేశాల పర్యటనపై కాంగ్రెస్‌ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘‘దేశం సంక్షోభంలో ఉంటే.. సాహెబ్‌ విదేశాల్లో ఉన్నారు’’ అని కాంగ్రెస్‌ విమర్శించింది.

Read  Also…  LAC Controversy: వక్రబుద్ది మారని డ్రాగన్ కంత్రీ(ట్రీ).. ప్యాంగోంగ్ సరస్సు వద్ద అక్రమ రహదారి నిర్మాణం!

Latest Articles