Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న ఇద్దరు భార్యలు.. మరీ ఆ ఒక్కరోజు మాత్రం..!

బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఒక భర్తను ఇద్దరు భార్యలు పంచుకున్నారు. విభజన నియమం ప్రకారం, భర్త వారంలో మొదటి మూడు రోజులు మొదటి భార్యతో ఉంటాడు. మిగిలిన మూడు రోజులు అతను రెండవ భార్యతో ఉంటాడు. అంతేకాదు, అతనికి ఒక రోజు సెలవు లభిస్తుంది. ఈ సమయంలో, అతను తనకు నచ్చిన ఎవరితోనైనా ఉండేలా ఫ్యామిటీ కౌన్సిలింగ్ సెంటర్‌లో ఒప్పందం కుదిరింది.

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న ఇద్దరు భార్యలు.. మరీ ఆ ఒక్కరోజు మాత్రం..!
Purina News AI Image
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 14, 2025 | 9:23 PM

బీహార్‌లో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. పూర్ణియా జిల్లాలో ఒక భర్తను ఇద్దరు భార్యలు రోజుల వారీగా పంచుకున్నారు. ఈ పంపకాలు ఏ పంచాయతీయో.. కుటుంబం సమ్మతితో జరగలేదు. పోలీసుల సమక్షంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో జరగడం విశేషం. వారానికి మూడు రోజులు మొదటి భార్యతో, మరో మూడు రోజులు రెండవ భార్యతో ఉండేలా భర్త, భార్యలిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అతనికి ఒక రోజు సెలవు ఇచ్చారు. పోలీసుల ముందు సదరు భర్త కూడా ఈ ప్రతిపాదనకు తన సమ్మతిని తెలిపాడు.

పూర్ణియాలో పోలీసు సూపరింటెండెంట్ కార్తికేయ శర్మ పర్యవేక్షణలో నడుస్తున్న పోలీసు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో శుక్రవారం(ఫిబ్రవరి 14) రోజున 14 కేసులు పరిష్కరించారు. ఈ సమయంలో విడివిడిగా నివసిస్తున్న చాలా మంది భార్యాభర్తలు తిరిగి కలిశారు. ఈ క్రమంలోనే ఒక కేసు విషయంలో పోలీసులు ఈ విధంగా తీర్మానించారు. ఇదిలావుంటే, కొన్ని రోజుల క్రితం, ఒక మహిళ పోలీసు సూపరింటెండెంట్ కార్తికేయ శర్మ వద్దకు వచ్చింది. ఆ మహిళ రూపౌలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసి. ఆ మహిళ తన భర్తపై పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. అందులో తన భర్త తనను విడిచిపెట్టాడని, తనకు భరణం కూడా అందించడం లేదని పేర్కొంది.

దీనిని కుటుంబ విషయంగా పరిగణించి, దరఖాస్తును మొదట పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పంపారు. ఫిర్యాదు అందిన తర్వాత, భర్తకు కేంద్రంలో హాజరు కావాలని నోటీసు జారీ చేశారు. శుక్రవారం నాడు భర్తతోపాటు భార్యాలిద్దరూ కేంద్రం ముందు హాజరయ్యారు. భర్త ఏడేళ్ల క్రితం తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, వారిని అతను పోషించలేకపోతున్నాడని మొదటి భార్య ఆరోపించింది. వివాహం తర్వాత, అతను ఈ విషయాన్ని చాలా రోజుల వరకు దాచిపెట్టాడని పోలీసులకు వివరించింది.

తన భర్త రెండవ వివాహం చేసుకున్నాడని తెలియగానే, తనను వదిలేసి అతను రెండవ భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడని భార్య ఆరోపించింది. అప్పటి నుంచి ఆమెతోనే నివసిస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు కూడా పెద్దవుతున్నారని మొదటి భార్య చెప్పింది. వారి చదువులకు, ఆహార ఖర్చులకు భర్త ఎలాంటి డబ్బు ఇవ్వడం లేదని తెలిపింది. మొదటి భార్య ఆరోపణలు విన్న తర్వాత, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సభ్యులు భర్తను మందలించి, విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని చెప్పారు.భార్య ఫిర్యాదుతో శిక్ష తప్పదని హెచ్చరించారు.

భర్త తన తప్పును అంగీకరించి, తన మొదటి భార్య, పిల్లల వద్దకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ అతని రెండవ భార్య అతన్ని అడ్డుకుంది. ఇప్పుడు అతనికి రెండవ భార్య ద్వారా కూడా పిల్లలు ఉన్నారు. మరి అతను ఎక్కడికి వెళ్ళాలి? తన మొదటి భార్యను కలవడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడల్లా, రెండవ భార్య తనను బెదిరిస్తుందని భర్త చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవలతో అతను విసిగిపోయాడు. అదే సమయంలో, ఫ్యామిలీ సెంటర్ సభ్యులు కూడా రెండవ భార్యను తిట్టి, అతను వివాహం చేసుకున్నాడని తెలిసినప్పుడు, అతన్ని వివాహం చేసుకోకూడదని అన్నారు.

ఇప్పుడు మీ భర్త జైలుకు వెళ్తాడని ఫ్యామిలీ సెంటర్ సభ్యులు చెప్పడంతో, వారిద్దరూ భయపడ్డారు. భర్త, భార్యలిద్దరూ తమలో తాము నిర్ణయించుకున్నారు. భర్త పెద్ద భార్యతో నాలుగు రోజులు, రెండవ భార్యతో మూడు రోజులు ఉండాలని నిర్ణయించారు. అయితే, పెద్ద భార్యతో నాలుగు రోజులు ఉండడంపై మళ్ళీ గొడవ మొదలైంది. ఆ తర్వాత కేంద్రం తన నిర్ణయాన్ని ఇచ్చింది. పెద్ద భార్యతో భర్త మూడు రోజులు, చిన్న భార్యతో మూడు రోజులు ఉండవచ్చని కేంద్రం తీర్పు ఇచ్చింది. ఆ మితిమీరిన గొడవ చూసి, భర్తకు ఒక రోజు సెలవు ఇచ్చారు.

ఒకరోజు భర్త ఎవరితో నివసిస్తాడనేది అతని ఇష్టానికి వదిలేశారు. అదే సమయంలో పెద్ద భార్య పిల్లల చదువు, పోషణ కోసం నెలకు రూ. 4,000 ఇవ్వాలని నిర్ణయించారు పోలీసులు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత, అతన్ని వెనక్కి పంపించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..