మాజీ భార్యతో ‘చిక్కు’ ! తేజ్ ప్రతాప్ ‘సీటు’ మారేనా ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కి సరికొత్త ‘చిక్కు’ వచ్చి పడింది. 2015 లో ఈయన మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 28 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని మొదట భావించినప్పటికీ ఈయన మాజీ భార్య ఐశ్వర్య ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేయవచ్చునని […]

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కి సరికొత్త ‘చిక్కు’ వచ్చి పడింది. 2015 లో ఈయన మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 28 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేయాలని మొదట భావించినప్పటికీ ఈయన మాజీ భార్య ఐశ్వర్య ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేయవచ్చునని వార్తలు వస్తున్న దృష్ట్యా… తేజ్ ప్రతాప్… ఆమెతో ‘మనకెందుకులే మళ్ళీ తగాదా’ అనుకుని మరో నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన సమస్తిపూర్ జిల్లాలోని హసన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. 2018 లో తేజ్ ప్రతాప్, ఐశ్వర్య ల పెళ్లి జరిగింది. అయితే 5 నెలలకే ఇద్దరూ విడిపోయారు. ఆమెకు డైవోర్స్ ఇచ్చెందుకు తేజ్ ప్రతాప్ సిధ్ధపడ్డారు. ఇప్పుడు ఐశ్వర్య మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసినా.. విడిపోయిన ఈ దంపతుల గెలుపోటములు ఎలా ఉంటాయో చూడాల్సిందే !



